దూకుడుగా ఎన్‌పిఆర్‌ అమలుకు జగన్ ప్రభుత్వం సిద్ధం!

రాష్ట్రంలో ఎన్‌పిఆర్‌ను అమలు చేయబోమని కడప సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినా ఆచరణలో అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారికంగా మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఎన్‌పిఆర్‌ వివరాల నమోదు పూర్తి చేశారు. ఇదంతా రాష్ట్రంలో ఎన్‌పిఆర్‌ జరగదని సిఎం సహా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులందరూ ప్రకటి స్తున్న సమయంలోనే అమలు చేయడం విశేషం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు తాము ఎన్‌పిఆర్‌ను అమలు చేయబోమని చెప్పిన సమయంలోనే మరోవైపు దానికి […]

  • Written By: Neelambaram
  • Published On:
దూకుడుగా ఎన్‌పిఆర్‌ అమలుకు జగన్ ప్రభుత్వం సిద్ధం!


రాష్ట్రంలో ఎన్‌పిఆర్‌ను అమలు చేయబోమని కడప సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినా ఆచరణలో అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారికంగా మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఎన్‌పిఆర్‌ వివరాల నమోదు పూర్తి చేశారు. ఇదంతా రాష్ట్రంలో ఎన్‌పిఆర్‌ జరగదని సిఎం సహా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులందరూ ప్రకటి స్తున్న సమయంలోనే అమలు చేయడం విశేషం.

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు తాము ఎన్‌పిఆర్‌ను అమలు చేయబోమని చెప్పిన సమయంలోనే మరోవైపు దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అధికారులు, సిబ్బంది విధులు ఏమిటి?, ఎలా చేయాలనే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అధికారికంగా విధివిధానాలపై చర్చించారు.

దీనిలో భాగంగా పలు కీలక ప్రశ్నలు వేయనున్నారు. ఆన్‌లైన్‌ పద్దతిలో ఈ సర్వే జరగనుంది. దీనికోసం సాధారణ పరిపాలన శాఖ నోడల్‌ ఏజన్సీగా వ్యవహరించనుంది. ఈ సర్వేలో ముఖ్యంగా ప్రజల జీవన విధానంతోపాటు వారి ఆహార అలవాట్లపైనా వివరాలు నమోదు చేయనున్నారు. మొత్తం 34 ప్రశ్నల్లో మీ ఆహార అలవాట్లు ఏమిటి? అనేది కూడా కీలకమైన ప్రశ్నగా పొందుపరిచారు.

ముఖ్యంగా కులం, మతం, వారెక్కడ నుండి
వలసొచ్చారు అనే అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌సికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఉపాధ్యాయులు చేపట్టనున్నారు. తొలుత ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటారు. వ్యక్తిగత ఆస్తులు, వాహనాల వివివరాలకు ఒక ప్రశ్నాపత్రం ఇవ్వనున్నారు.

ఇంట్లో మౌలిక సదుపాయాల గురించి మరో ప్రశ్నాపత్రం ఈ రెండిటికీ కలిపి 34 ప్రశ్నలు ఉండనున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఆహారం ఏమి తింటారు, ఇంట్లో గదులెన్ని, సొంత ఇళ్లా, అద్దె ఇళ్లా, ఆస్తులు, మతం, ఎస్‌సి, ఎస్‌టి, భాష, సాహిత్యం, విద్య, ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి, వలసలు, సాంతన సాఫల్యత తదితర అంశాలన్నీ ఉండనున్నాయి. వీటితోపాటు వారసత్వ వివరాలనూ వెల్లడించాల్సి ఉంటుంది.

జాతీయ జనాభా పట్టికను ఏడాది కాలంలోనే పూర్తి చేయనున్నారు. ఎన్‌పిఆర్‌ విషయంలో ఎటువంటి లోపాలూ లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే మానసికంగా ధృడత్వంగానూ ఉండేలా ఎన్యూమరేటర్లకు తగు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.

జనగణన, ఎన్‌పిఆర్‌కు సంబంధించిన వివరాలను తీసుకునేందుకు ఆరు భాషల్లో పత్రాలు రూపొందించినట్లు సెన్సస్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. దీనికోసం పట్టణాలను బ్లాకులుగా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు