Homeఅంతర్జాతీయంUS Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌ పేపరే.. ఎందుకో తెలుసా?

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌ పేపరే.. ఎందుకో తెలుసా?

US Presidential Election 2024: అగ్రరాజ్యం అమెరికా.. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 15 ఏళ్లుగా జాతీయ ఎన్నికల సంఘం పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహిస్తోంది. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కూడా దీనిపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం ఈవీఎంలతో నిర్వహణకే అనుమతి ఇచ్చింది. దాదాపు 80 కోట్లకుపైగా ఓటర్లు ఉన్న భారత్‌లో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణే భారంగా మారింది. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించడం మరింత భారమవ్వడమే కాకుండా దాదాపు భారీగా వ్యయం కూడా అవుతుంది. దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈవీఎంలతో రెండు నెలల్లో ఎన్నికలు పూర్తి చేస్తున్నారు.

అమెరికాలో బ్యాలెట్‌ పేపర్లతోనే..
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈఏడాది నవంబర్‌లోనూ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందుకు కారణాలు రెండు ఉన్నాయి. అక్కడ భారత్‌ తరహాలో భారీగా ఓటర్లు లేరు. దీంతో అక్కడ ఎన్నికల నిర్వహణ ఈజీ అవుతోంది. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

రింగింగ్‌ అవకాశం..
ఇక ఇండియాలో బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికల నిర్వమణలో బలవంతులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో అనే ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది. కానీ అమెరికాలో అలాంటి పరిస్థితి లేదు. పటిష్టమైన భద్రత కారణంగా అక్కడ ఇప్పటికీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో దాడులు..
ఇక ఇండియాలో ఎన్నికల ప్రచారానికే భారీగా ఖర్చు చేస్తున్నారు. దాడులకు కూడా వెనుకాడడం లేదు. అమెరికాలో ప్రచారం అంతా మీడియాలోనే ఉంటుంది. సభలు, డిబేట్ల ద్వారా క్యాంపెయినింగ్‌ చేస్తారు. దీంతో దాడులకు అవకాశం లేదు. సెక్యూరిటీ సమస్య కూడా ఉండదు. బ్యాలెట్‌ కౌంటింగ్‌ కూడా త్వరగా పూర్తవుతుంది. ఇక పోటీచేసే అభ్యర్థులు ముగురు, నలుగురికి మించి ఉండరు. భారత్‌లో మాత్రం ఒక నియోజకవర్గానికే పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో మనదేశంలో ఈవీఎంల నిర్వహణ అనివార్యమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular