SRH Vs LSG IPL 2024
SRH Vs LSG IPL 2024: కీలకమైన ప్లే ఆఫ్ ముందు హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని దర్జాగా పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వెళ్లిపోయింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది..నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. బుధవారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో లక్నో జట్టు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 150+ పరుగుల లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. పవర్ ప్లే లో రెండుసార్లు 100 +పరుగులు చేసిన జట్టుగా వినతికెక్కింది. ఈ సీజన్లో హైదరాబాద్ రెండుసార్లు పవర్ ప్లే లో 100+ రన్స్ చేయడం విశేషం.
బంతుల పరంగా
భారీ విజయం సాధించిన జట్లు (100+ పరుగుల లక్ష్యాలు)
బుధవారం ఉప్పల్ మైదానంలో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 166 పరుగుల విజయ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో పూర్తిచేసింది. ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
2022లో బ్రా బౌర్న్ స్టేడియంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 116 పరుగుల విజయ లక్ష్యాన్ని 57 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.. ఇప్పటివరకు ఇది రికార్డుగా ఉండేది. హైదరాబాద్ జట్టు దీనిని బ్రేక్ చేసింది.
2008లో ముంబై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 155 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ జట్టు 48 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
10 ఓవర్ల తర్వాత.. అత్యధిక స్కోరు చేసిన జట్లు ఇవే
బుధవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 167 /0 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన రికార్డు.
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
ఇక ఇదే సీజన్లో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
పవర్ ప్లే లోనూ..
ప్రస్తుత సీజన్లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసింది.
ఇదే సీజన్లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ వికెట్ కోల్పోకుండా 107 రన్స్ చేసింది.
2017లో బెంగళూరు వేదికగా కోల్ కతా, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కోల్ కతా 105/0 పరుగులు చేసింది.
ముంబైలో 2014లో జరిగిన మ్యాచ్లో చెన్నై, పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్ కతా పై జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Srh vs lsg ipl 2024 sunrisers hyderabad register second highest powerplay score of the season
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com