కన్నడ భామ ఆషిక రంగనాథ్ అభిమానులను తన అందాలతో అలరిస్తుంది. అమ్మడు గ్లామరస్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చీర కట్టులో మత్తెక్కించే అందాలతో చిత్తు చేసింది. ఆషిక రంగనాథ్ ని అలా చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. Photo: Instagram
కన్నడ భామ ఆషిక రంగనాథ్ కెరీర్ 2016లో మొదలైంది. ఆమె మొదటి చిత్రం బ్యాడ్ బాయ్స్. ఈ కన్నడ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. అనంతరం శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మాస్ లీడర్ మూవీలో నటించింది. కెరీర్ బిగినింగ్ లో ఆమె ఎక్కువగా కన్నడ చిత్రాలు చేసింది. Photo: Instagram
ఆషిక రంగనాథ్ నటించిన మొదటి తెలుగు చిత్రం అమిగోస్. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే కింగ్ నాగార్జున ఆమెకు బంపర్ ఛాన్స్ ఇచ్చాడు. నా సామిరంగ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. Photo: Instagram
2024 సంక్రాంతి కానుకగా విడుదలైన నా సామిరంగ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక రోల్స్ చేశారు. నా సామిరంగ చిత్రంతో ఆషిక రంగనాథ్ కి తెలుగులో మొదటి హిట్ పడింది. నా సామిరంగ మలయాళ చిత్ర రీమేక్ కావడం విశేషం. Photo: Instagram
నా సామిరంగ చిత్రంలో ఆషిక రంగనాథ్ రోల్ కీలకంగా ఉంటుంది. తండ్రి మరణంతో మనసు చంపుకుని ప్రియుడికి దూరమైన అమ్మాయిగా ఈ చిత్రంలో ఆమె కనిపించారు. నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ బాగానే కుదిరింది. Photo: Instagram
కాగా ఆషిక రంగనాథ్ ప్రస్తుతం గత వైభవ టైటిల్ తో ఒక కన్నడ చిత్రం చేస్తుంది. ఇది పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. దుష్యంత్ హీరోగా నటిస్తున్నాడు. సింపుల్ సుని దర్శకుడు. ఈ చిత్రంపై ఆషిక రంగనాథ్ చాలా ఆశలే పెట్టుకుంది. Photo: Instagram
Web Title: Ashika ranganath latest glamorous looks gone viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com