HomeతెలంగాణAsaduddin Owaisi: అసదుద్దీన్ కు అర్చకుల అండ.. మాధవీలత పరిస్థితి ఏంటి?

Asaduddin Owaisi: అసదుద్దీన్ కు అర్చకుల అండ.. మాధవీలత పరిస్థితి ఏంటి?

Asaduddin Owaisi: మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా… ఇందులో హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్థానంలో కొన్ని దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ హవా కొనసాగిస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఆయనకు చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ గట్టి కృషి చేస్తోంది. ఇప్పటివరకు ఓటమి తెలియని అతడిని ఇంటికి పంపించాలని బిజెపి స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా అతనికి ప్రత్యర్థిగా మాధవిలతను బరిలోకి దింపింది.

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మాధవి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లింల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. మాధవి లత తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా హైదరాబాద్ లో గెలవాలనే ఉద్దేశంతో బిజెపి నాయకులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు.. అటు బిజెపి, ఇటు ఎంఐఎం హోరాహోరిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది.

మాధవి లత తనదైన దూకుడుతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైసీ మీద మాటల దాడి మొదలుపెట్టారు. ఇంకా ఇటీవల నరేంద్ర మోడీ కూడా ముస్లింలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి అసదుద్దీన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కాక పెరిగిపోయింది. ఇలా ప్రచారం సాగుతూ ఉండగానే.. హైదరాబాద్ లోని మలక్ పేట ప్రాంతంలో మూసారాం బాగ్, ఇందిరానగర్ ప్రాంతాలలో అసదుద్దీన్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పురోహితులు మద్దతు పలికారు.. దీనిని ఎంఐఎం తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. శుక్రవారం ప్రచార సాగిస్తున్న అసదుద్దీన్ వద్దకు కొంతమంది పురోహితులు వచ్చి.. ఆయనకు పూలమాల వేశారు. అనంతరం మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆ ఫోటోలను ట్విట్ చేసిన ఎంఐఎం.. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంఐఎం కు ప్రజలు అండగా ఉంటున్నారంటూ పేర్కొన్నది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular