CM Jagan Daughters: వైెయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. ఇక కొత్త కొత్త పథకాలతో ప్రజల అవసరాలు తీర్చారు. ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్నీ పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో జోరందుకున్నాయి. అందులో విధంగా సీఎం జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు.
సీఎం జగన్ రాజకీయ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయిస్తారు అని తెలిసిందే. ఇక ఈయన భార్య వైఎస్ భారతి అనే విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు. ఒకరు వర్ష, మరొకరు హర్ష. వీరిద్దరు కూడా విదేశాల్లోనే ఉన్నారు. మొదటి కూతురు హర్ష రెడ్డి కొంత కాలం క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారట. ఫ్రోన్స్ లోని ఫౌంటైన్ బ్లూ లో ఉన్న ఇన్ సైడ్ బిజినెస్ స్కూల్ నుంచి హర్ష పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ని అందుకుంది అని టాక్.
అక్కడ చదువుకోవడానికి సంవత్సరానికి 89వేల యూరోలు ఖర్చు అవుతుందట. అంటే మన దేశంలో ఈ మొత్తం దాదాపు రూ. 80 లక్షలు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న హర్ష అక్కడే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నారట కూడా. వైయస్ జగన్ చిన్న కూతురు పేరు వర్షా రెడ్డి. ఈమె అమెరికాలో చదువుకుంటున్నారు. నోట్రె డామ్ యూనివర్శిటీలో ఈమె చదువుకుంటున్నారు. అక్కడ ట్యూషన్ ఫీజ్ ఏకంగా 60 వేల డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ తో పోలిస్తే రూ. 50 లక్షలు. ఈమె చదువు ఇంకా కొనసాగుతుంది. ఇక తమ కూతుర్లను చూడటానికి ఇద్దరు కూడా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి వస్తుంటారు.