Tesla Layoffs: ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ దిగ్గజం, అమెరికా మూలాలు కలిగి ఉన్న టెస్లా కంపెనీ రాత్రికి రాత్రే కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకునేందుకు 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది.. బిల్డింగ్ ఛార్జింగ్, టెక్నాలజీ విభాగాలలో పనిచేస్తున్న 500 మందికి కారణం లేకుండా పింక్ స్లిప్ జారీ చేసింది.. దీంతో ఆ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మస్క్ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఉద్యోగాలు కోల్పోయిన 500 మందిలో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఒక మహిళ ఉంది. కారణం లేకుండా, రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించడం పట్ల స్పందించింది. ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత తన బాధను లింక్డ్ ఇన్ లో పంచుకుంది..
“దురదృష్టవశాత్తు నాతోపాటు 500 మంది వ్యక్తులు టెస్లా నుంచి బయటికి వచ్చారు. వీరంతా చార్జింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. నేను ఇకపై టెస్లాలో పనిచేయలేను. టెస్లాలో బిల్డింగ్ చార్జింగ్, టెక్నాలజీ విభాగాలలో అత్యంత అంకితభావం కలిగిన వ్యక్తులతో పనిచేయడం నాకు ఒక గౌరవం. అది నాకు ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. అత్యుత్తమ నైపుణ్యాన్ని సాధించేందుకు, మెరుగైన ప్రమాణాలు నెలకొల్పేందుకు మా కోసం ఎక్కువ బార్ సృష్టించారు. అయినప్పటికీ మేము కష్టపడి పని చేసినా మమ్మల్ని టెస్లా నుంచి తొలగించారు. అయితే తదుపరి పని మాకు అత్యంత సవాల్ గా ఉంది. మా బృందం కలిసి సాధించిన వాటిని గుర్తు చేసేందుకు నా ముఖం టెస్లా వెబ్ సైట్ లో కనిపిస్తూనే ఉంటుందని” ఆమె పేర్కొన్నారు.
పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆ మహిళ టెస్లా కంపెనీలో తన ఉద్యోగం సాగిన తీరును లింక్డ్ ఇన్ లో రాసిన తీరు పట్ల నెటిజెన్లు స్పందిస్తున్నారు. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని కొందరు పేర్కొన్నారు. మీకు అందమైన భవిష్యత్తు ఉంది, దానికోసం ప్రయత్నం చేయండి అని మరికొందరు సూచించారు. ఇలా వినడం బాధాకరం, అయినప్పటికీ మీరు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. కాగా, ఖర్చుల తగ్గింపు పేరుతో టెస్లా కంపెనీ ఉద్యోగాలలో కోతలు విధిస్తోంది. ఇటీవల టెస్లా నుంచి కోతలు పెరిగిపోవడంతో.. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లంతా తమ బాధను సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ విభాగం నుంచి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి తన బాధను వ్యక్తీకరించిన తీరు లక్షల మందిని కదిలించేలా చేసింది. ” నేను టెస్లాలో అపాయింట్ అయిన నాటి నుంచి చాలా కష్టపడ్డాను. చాలాసార్లు ఫ్యాక్టరీలోనే స్నానం చేశాను. కంపెనీ కార్యాలయంలోనే ఉండిపోయాను. చాలా రోజులు అక్కడే గడిచాయి. కానీ ఇప్పుడు నా ఉద్యోగం కోల్పోయాను. తదుపరి ప్రయాణం ఏమిటో అర్థం కావడం లేదు. మస్క్ ఇలా ఎందుకు చేస్తున్నారో అంత పట్టడం లేదని” ఆ మాజీ ఉద్యోగి రాసుకొచ్చాడు. కేవలం టెస్లా కంపెనీ మాత్రమే కాదు, దాని అనుబంధ సంస్థ ట్విట్టర్ ఎక్స్ లోనూ గత ఏడాది మస్క్ అడ్డగోలుగా ఉద్యోగాలలో కోతలు విధించాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A woman of pakistani descent has spoken out after losing her job at tesla
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com