కాజల్ అగర్వాల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా ఆమె ఫేమ్ తగ్గలేదు. ఆఫర్స్ ఆగలేదు. ఇప్పటికీ కొన్ని క్రేజీ ఆఫర్స్ ఆమె దక్కించుకుంటుంది. Photos: Instagram
కాజల్ అగర్వాల్ మొదటి చిత్రం లక్ష్మీ కళ్యాణం. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ మూవీ ఆడలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో ఫస్ట్ హిట్ కొట్టింది. నవదీప్, శివ బాలాజీ హీరోలుగా నటించారు. Photos: Instagram
కాజల్ కి బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం మగధీర. దర్శకుడు రాజమౌళి మిత్రవింద పాత్రకు కాజల్ సెట్ అవుతుందని ఎంపిక చేశాడు. అయితే చిరంజీవి అభ్యంతరం చెప్పాడట. అప్పటికి కాజల్ కి స్టార్డం రాలేదు. మరొక హీరోయిన్ అయితే బెటర్ అన్నారట. కానీ రాజమౌళి పట్టుబట్టి కాజల్ కి ఆఫర్ ఇచ్చాడట. Photos: Instagram
లుక్ టెస్ట్ చేసి చిరంజీవికి ఫోటోలు చూపించాక ఆయన కూడా సంతృప్తి చెందాడట. రామ్ చరణ్ హీరోగా 2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దాంతో కాజల్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. అక్కడ నుండి కాజల్ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. స్టార్స్ పక్కన ఆఫర్స్ పెట్టేస్తూ స్టార్ గా ఎదిగింది. Photos: Instagram
కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో కాజల్ పెళ్లి చేసుకుంది. తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లు తో 2020లో పెళ్లి జరిగింది. వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు. వీరికి ఒక అబ్బాయి. తల్లిగా నటిగా కెరీర్ ని బాలన్స్ చేస్తుంది. Photos: Instagram
ఈ మధ్య డిజిటిల్ సిరీస్లు, చిత్రాల్లో నటిస్తుంది. గత ఏడాది కాజల్ భగవంత్ కేసరి చిత్రం చేశారు. బాలయ్యకు జంటగా నటించింది. భగవంత్ కేసరి హిట్ అయినప్పటికీ... కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కాగా సోషల్ మీడియాలో అమ్మడు గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. కాజల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photos: Instagram
Web Title: Kajal aggarwal stuns in a white floral lehenga
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com