Pushpa 3: ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం పుష్ప 2 సినిమా ఫీవర్ నడుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ గాని, సాంగ్ గాని, ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా సినిమా మీద ఆటోమేటిగ్గా అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియదు కానీ ఈ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ చేయడానికి చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పుష్ప 3 సినిమాని కూడా పట్టాలెక్కిస్తామంటూ సినిమా యూనిట్ అయితే అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీద జనాల్లో విపరీతమైన ఆంచనలైతే ఉన్నాయి.అయితే పుష్ప 2 సినిమా సక్సెస్ ను బట్టి పుష్ప 3 సినిమా ఉంటుందా లేదా అనే డిసీజన్ తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే పుష్ప 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం పుష్ప రాజ్ క్యారెక్టర్ ను ఇంకా కొనసాగించాలనే ఉద్దేశ్యం లో సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఈ సినిమా రిలీజ్ అయితే గాని, పుష్ప 3 సినిమా ఎప్పుడు షూటింగ్ ఉంటుంది, అసలు ఉంటుందా లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ అయితే దొరుకుతుంది.
ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాకు ఉన్న హైప్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు ఈజీగా రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడ్డాడు అనే విషయం మనకు ఈ సినిమా టీజర్ ను చూస్తుంటేనే అర్థమవుతుంది…