Kim Jong Un: ఉత్తరకొరియా.. తరచూ సంచలనాలతో వార్తల్లో నిలుస్తుంది. ఆ దేశంతోపాటు, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి సంచలన విషయాలు అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి. తాజాగా కిమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనను ‘సంతోష పెట్టడానికి’ ఏటా 25 మంది యువతుల బృందం పనిచేస్తుందట. వీరి ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా చేస్తారట. విధేయత ఆధారంగా వీరిని ఎంపిక చేసుకొని.. వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని సమాచారం. కిమ్‌ను ‘సంతోష పెట్టే’ బృందంగా పేర్కొనే ఈ పనికి గతంలో ఎంపికైన, ఉత్తర కొరియా నుంచి పారిపోయిన ఓ యువతి చెప్పిన విషయాలను ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వైద్య పరీక్షలు తప్పనిసరి..
కిమ్‌ను సంతోషపెట్టే టీం సభ్యుల కోసం యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం ఆయన సన్నిహితులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తారు. కొంతమందిని ఎంపిక చేసిన తర్వాత వారి కుటుంబం, రాజకీయ నేపథ్యం గురించి ఆరాతీస్తారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయిన లేక దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని పక్కన పెడతారు. 25 మందిపి ఎంపిక చేసిన తర్వాత.. వారికి కన్యత్వ పరీక్షలు చేస్తారు. చిన్న మచ్చ ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం వారిని ప్యాంగ్యాంగ్కు పంపిస్తారు. నియంతను అన్ని విధాలుగా సుఖ పెట్టడమే వారి పని.
మూడు బృందాలుగా విభజించి..
ఎంపిక చేసిన 25 మంది యువతుల బృందాన్ని మూడు విభాగాలుగా విభజిస్తారు. కిమ్‌కు మసాజ్ చేయడానికి ఒక బృందం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడానికి ఇంకో బృందానికి శిక్షణ ఇస్తారు. మూడో గ్రూపు లైంగిక కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. నియంతతో సన్నిహితంగా ఉండడమే వారి విధి. పురుషులను ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుంటారు. అత్యంత అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్ తన దగ్గరకు పిలుచుకుంటారు. యువతలు వయసు 20 ఏళ్లు వచ్చే వరకు ఆ బృందంలోనే ఉంచుకుని, ఆ తర్వాత కిమ్ అంగరక్షకులతో వారికి పెళ్లి చేస్తారని తెలిపింది.
కుటుంబ సభ్యుల అంగీకారం..
ఇదిలా ఉంటే.. కిమ్ బృందంలో యువతులు పనిచేయడానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారట. తమ పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉంటారనే ఉద్దేశంతో కిమ్ బృందానికి సెలక్ట్ కావాలని కోరుకుంటారట. అయితే, ఈ సంస్కృతి కేవలం కిమ్ హయాంలోనే ఇది మొదలు కాలేదు. 1970 నుంచే ఈ బృందం అక్కడ పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Shocking facts about north korean president kim jong un
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com