Homeఆంధ్రప్రదేశ్‌Gadde Ramamohan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గద్దె లీక్స్

Gadde Ramamohan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గద్దె లీక్స్

గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడ్డారు గద్దె రామ్మోహన్. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో దిగారు. ప్రస్తుతం నియోజకవర్గంలో హోరాహోరీ ఫైట్ నెలకొంది.

Gadde Ramamohan: ఎన్నికలకు నాలుగు రోజుల వ్యవధి ఉండగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు గట్టి షాక్ తగిలింది. గద్దె లీక్స్ పేరిట యువతులతో రామ్మోహన్ రావు సన్నిహితంగా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గత రెండు ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి గెలిచారు గద్దె రామ్మోహన్. గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఆయనకు 2014లో చంద్రబాబు విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడ్డారు గద్దె రామ్మోహన్. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో దిగారు. ప్రస్తుతం నియోజకవర్గంలో హోరాహోరీ ఫైట్ నెలకొంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే గద్దె రామ్మోహన్ దగ్గర పనిచేసిన వాసు అనే వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది.

నా పేరు వాసు.. నేను గుర్తున్నానా.. గత 15 సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులు చేయించుకున్నారు కదా
.. అంటూ ప్రారంభమైంది ఈ పోస్ట్. ఎంతో నమ్మకంగా ఉంటే నన్ను అవమానిస్తారా? తిడతారా? ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడతారా? అంటూ వాసు అనే వ్యక్తి గద్దె రామ్మోహన్ ను ప్రశ్నిస్తూ.. కొన్ని రకాల విషయాలను చెప్పుకొచ్చారు. నన్ను దారుణంగా అవమానిస్తున్నందునే నీ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నానంటూ.. ఆయన ఎంతోమంది జీవితాలతో ఆటలాడుకున్నారని.. కామ వాంఛ తీర్చుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే అంతటితో ఆగకుండా ఓ 20 సంవత్సరాల యువతీతో గద్దె రామ్మోహన్ సన్నిహితంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

అంతటితో ఆగని ఆయన ఏకంగా గద్దె రామ్మోహన్ ఫోన్ నెంబర్లను సైతం జతపరిచారు. ఆ నెంబర్లకు సంబంధించి వాట్సప్ మెసేజ్ లను స్క్రీన్ షాట్లు చేసి మరి జత చేయడం విశేషం. శ్వేత, నర్మదా, బంగారం అంటూ యువతుల పేర్లు సైతం ప్రస్తావించారు. నువ్వు ఫేక్ అని చెప్పినా.. ఇంకో ఫోటో పెట్టా.. అది ఎవరి విడాకులో తెలుసు కదా,? అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ సాగిన ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సరిగ్గా ప్రధాని మోదీ విజయవాడలో కూటమి అభ్యర్థుల ప్రచారానికి వస్తుండగా..ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper