Virat Kohli dancing on DJ Tillu song at Hyderabad
Viral Video: ఇండియన్ క్రికెట్ టీం హిస్టరీలో విరాట్ కోహ్లీ కి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది. ఆయన వల్లే ఇండియన్ టీం ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ‘రన్ మిషన్’ గా పేరు తెచ్చుకున్న ‘కింగ్ కోహ్లీ’ ఇండియన్ టీమ్ కు ఎనలేని సేవలైతే అందిస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పటికి కూడా ఇండియన్ టీం తరపున తన సత్తా చాటుతూ చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ లో తన సత్తా చాటుతున్న విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కి విజయం అందించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడిన మ్యాచ్ లో ఆర్సిబి టీమ్ ఘన విజయాన్ని దక్కించుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసేటప్పుడు డీజే టిల్లు పాట పెట్టడంతో తను ఆ పాటకి డ్యాన్స్ చేసి తన అభిమానులందరినీ అలరించాడు. ఇక ముఖ్యంగా తన అభిమానులందరూ అరుస్తూ ఉంటే తను చాలా ఎంజాయ్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడనే కాదు విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా గ్రౌండ్ లో చాలా యాక్టివ్ గా, చాలా దూకుడుగా ఉంటాడు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవ పెట్టుకోవడానికి కూడా తను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.
అలాంటి కోహ్లీ ఆర్సిబి టీం తరపున తనదైన సేవలు అందిస్తూ రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన ఈ టీమ్ లోనే ఆడుతూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆర్సిబి టీమ్ చాలా కష్టాల్లో ఉంది. ఇక ఇప్పుడు ఆడబోయే అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే తప్ప ఆ టీం సెమీస్ కి వెళ్లే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి…ఇక ఇప్పుడు డిజే టిల్లు పాట మీద కోహ్లీ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…
Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.
– KING KOHLI IS A VIBE. ❤️ pic.twitter.com/KkI3wTKdKp
— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024