Homeఎంటర్టైన్మెంట్Pragathi Aunty: బుల్లెట్ రాణిగా మారిన ప్రగతి ఆంటీ... క్రేజీ వీడియో వైరల్, నెటిజెన్స్ కామెంట్స్...

Pragathi Aunty: బుల్లెట్ రాణిగా మారిన ప్రగతి ఆంటీ… క్రేజీ వీడియో వైరల్, నెటిజెన్స్ కామెంట్స్ షురూ!

Pragathi Aunty: నటి ప్రగతి సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె బుల్లెట్ రాణిగా మారింది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు. పలు చిత్రాల్లో అమ్మ, అత్త పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గించిన ప్రగతి… జిమ్ లో వర్కౌట్లు చేస్తూ కనిపిస్తుంది.

ఇటీవల జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రగతి పార్టిసిపేట్ చేసింది. కేవలం పోటీ చేయడమే కాదు మెడల్ కూడా గెలిచింది. ఒక పక్క సినిమాలు చేస్తూనే,మరోవైపు స్పోర్ట్స్ లో రాణిస్తుంది. కాగా ప్రగతి ఆంటీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర వీడియో ఒకటి పోస్ట్ చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. డాన్స్, ఫిట్నెస్ వీడియోలు షేర్ చేస్తూ కాక పుట్టిస్తుంది.

ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిన ఆమె డైలీ జిమ్ లో హెవీ వర్కౌట్లు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపిస్తుంది. 48 ఏళ్ళ వయసులో స్ట్రాంగ్ బాడీ ని మైంటైన్ చేస్తుంది. తాజాగా బుల్లెట్ బైక్ నడుపుడుతున్న వీడియో ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.గల్లీ లో బైక్ పై చక్కర్లు కొట్టింది. షర్ట్ లేకుండా కేవలం ఇన్నర్ వేర్ ధరించి రౌడీలా బైక్ నడిపింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సదరు వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.

కాగా ప్రగతి సీరియల్స్ లో కూడా నటిస్తుంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘ ఊర్వశివో రాక్షసీవో ‘ సీరియల్ ఆమె నెగిటివ్ రోల్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ప్రగతి సినిమాలు చేస్తుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రగతి రెండో పెళ్లి పై అనేక రూమర్స్ వచ్చాయి. సదరు పుకార్లను ప్రగతి ఖండించింది. ప్రగతికి ఒక కూతురు ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

RELATED ARTICLES

Most Popular