Homeక్రీడలుSRH Vs LSG: హైదరాబాద్ నిలవాలంటే.. కచ్చితంగా గెలవాలి..

SRH Vs LSG: హైదరాబాద్ నిలవాలంటే.. కచ్చితంగా గెలవాలి..

SRH Vs LSG: ఐపీఎల్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో చేజేతులా ఓటమిని కొని తెచ్చుకోవడంతో.. ఇప్పుడు హైదరాబాద్ జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా బుధవారం ఉప్పల్ మైదానంలో లక్నో జట్టుతో జరిగే మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంతమైదానం కావడంతో విజయంపై హైదరాబాద్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.. బ్యాటింగ్లో హైదరాబాద్ జట్టుకు తిరుగు లేకపోయినప్పటికీ.. ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడటం ఇబ్బంది కలిగిస్తోంది. హెడ్ , అభిషేక్ శర్మ అవుట్ అయితే చాలు.. మిగతా ఆటగాళ్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇదే జరిగింది. అభిషేక్ శర్మ అవుట్ కావడంతో స్కోర్ మందగించింది. ఒక ఎండ్ లో హెడ్ ఉన్నప్పటికీ.. అతడు భారీగా పరుగులు సాధించలేకపోయాడు. చివర్లో కమిన్స్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక లక్నో జట్టుతో బుధవారం జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ఆ తప్పులు చేయకూడదని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గత సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన ఆ జట్టు.. ఈసారి మెరుగ్గానే ఆడుతోంది. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన హైదరాబాద్.. ఆ తర్వాత ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. అంతకుముందు బెంగళూరు, చెన్నై జట్లతో జరిగిన మ్యాచ్లలో ఓడిపోయింది.

హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం లో భువనేశ్వర్ కుమార్, కమిన్స్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. మిగతా వారు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. ముఖ్యంగా నటరాజన్ తన పూర్వపు లయను అందుకోవాల్సి ఉంది. స్పిన్ బౌలింగ్ కూడా మెరుగుపడాల్సి ఉంది. ఫీల్డింగ్ లోనూ ఆటగాళ్లు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. సొంత మైదానంలో గెలుస్తామనే అతి విశ్వాసాన్ని పక్కన పెట్టి.. సాధ్యమైనంతవరకు ఆత్మవిశ్వాసంతో ఆడితేనే మంచి ఫలితం ఉంటుంది.

ఇక లక్నో జట్టు ఈ సీజన్లో మెరుగ్గా ఆడుతోంది. రాహుల్ ఆధ్వర్యంలోని ఆ టీం ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రాజస్థాన్ తో జరిగిన పోరులో ఢిల్లీ గెలిచింది. ఫలితంగా ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు ఈ స్థానంలో లక్నో ఉండేది..కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో 98 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఎలాగైనా హైదరాబాద్ జట్టు పై గెలవాలని భావిస్తోంది. హైదరాబాద్ జట్టు పై గెలిస్తేనే లక్నో కు ప్లే ఆఫ్ అవకాశాలుంటాయి.. లక్నో జట్టులో టర్నర్, మయాంక్ యాదవ్ మెరుగ్గా బౌలింగ్ వేస్తున్నారు. మిగతావారు పెద్దగా రాణించడం లేదు. వారు తమ పూర్వపు లయ అందుకోవాలని జట్టు భావిస్తోంది.

ఇక బ్యాటింగ్ భాగంలో లక్నో జట్టు బలంగా ఉంది. క్వింటన్ డికాక్ దాటిగానే ఆడుతున్నప్పటికీ.. నిలకడలేమి అతడికి పెద్ద శాపంగా మారింది. కేఎల్ రాహుల్ తన వంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అతనికి మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదు. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, స్టోయినీస్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు హైదరాబాద్ తో ఆడిన మూడు మ్యాచ్ లలోనూ లక్నో విజయం సాధించింది.
గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం హైదరాబాద్ జట్టుకు గెలిచే అవకాశాలు 52%, లక్నో జట్టుకు 48% ఉన్నాయి.

జట్ల అంచనా

హైదరాబాద్

హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, మార్కో జాన్సన్, షాబాద్ అహ్మద్, అబ్దుల్ సమద్, కమిన్స్(కెప్టెన్), సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్.

లక్నో

హర్షిన్ కులకర్ణి, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ కూడా, స్టోయినీస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, టర్నర్, కృనాల్ పాండ్యా, యుద్దువీర్ సింగ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular