HomeతెలంగాణCM Revanth Reddy: చంద్రబాబు ఫ్యాన్స్ కు రేవంత్ ఝలక్

CM Revanth Reddy: చంద్రబాబు ఫ్యాన్స్ కు రేవంత్ ఝలక్

CM Revanth Reddy: చంద్రబాబు విషయంలో రేవంత్ రెడ్డి మనసు మారిందా? టిడిపి ఎన్డీఏలో చేరడంతో అభిప్రాయం మార్చుకున్నారా? ఇన్నాళ్లు గురువుగా సంబోధించిన ఆయన.. సడన్ గా సహచరుడు అన్నారు ఎందుకు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓ టీవీ ఛానల్ కు రేవంత్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో గతానికి భిన్నంగా రేవంత్ రెడ్డి స్పందించడం విశేషం. జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు చేరడంతోనే.. రేవంత్ మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అప్పటి టిఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ నాయకత్వంతో విభేదించి.. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. తరువాత టిడిపిలో చేరి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా వ్యవహరించారు. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనం కావడంతో కాంగ్రెస్ లో చేరారు. అయినా సరే చంద్రబాబుపై ఎటువంటి విమర్శలు చేయలేదు. పైగా సానుకూల వ్యాఖ్యలే చేస్తూ వచ్చారు. రేవంత్ కు తెలంగాణ పిసిసి పగ్గాలు దక్కడం వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ఒక ఆరోపణ. దానిని అధిగమించారు రేవంత్.

తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ కోసమే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. 2023 ఎన్నికల్లో మాత్రం అదే రేవంత్ కోసం చంద్రబాబు టిడిపిని పోటీలో పెట్టలేదని ప్రచారం జరిగింది. ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడిచింది. అయితే టిడిపి పోటీ చేయకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ సీఎం కాగలరు. అయితే ఇన్నాళ్లు చంద్రబాబు పట్ల విధేయత చూపుతూ వచ్చారు రేవంత్. అయితే ఏపీ పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ లో చేరారు. దీంతో చంద్రబాబు విషయంలో రేవంత్ అభిప్రాయం మార్చుకోక తప్పలేదు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ తెలుగు టీవీ ఛానల్ కు రేవంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణలో మీ గురువుచంద్రబాబు సాయం చేశారు.. ఇప్పుడు ఏపీలో మీ గురువుకు సాయం చేయరా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు రేవంత్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఎవరికి గురువు? ఎవరు గురువు? అంటూ గట్టిగానే ప్రశ్నించారు. చంద్రబాబు తనకు గురువు కాదని.. కేవలం సహచరుడు మాత్రమేనని తేల్చి చెప్పారు. అయితే రేవంత్ లో వచ్చిన ఈ మార్పు చూసి టిడిపి శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.రేవంత్ విషయంలో తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాయి.తెర వెనుక ఏదో జరుగుతోందని అనుమానం పడుతున్నాయి.అయితే కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు చేరడం వల్లే.. ఒక కాంగ్రెస్ సీఎంగా రేవంత్ అలా స్పందించారని.. అంతకుమించి ఏమీ లేదని.. చంద్రబాబుతో ఇప్పటికీ రేవంత్ కు మంచి సంబంధాలే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏది వాస్తవమో వారికే తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular