Catherine Tresa: రెడ్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జలకాలు… వాల్తేరు వీరయ్య హీరోయిన్ ని ఇంత హాట్ గా చూసి ఉండరు!
దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి జంటగా ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో ఎంపిక చేశాడు. ఈ చిత్రంలో అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు.
Written By:
S Reddy , Updated On : May 3, 2024 4:33 pm
Catherine Tresa swimming pool photos goes viral
Follow us on
హీరోయిన్ క్యాథరిన్ థెరిస్సా కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. 2010లో విడుదలైన శంకర్ ఐపీఎస్ ఆమె డెబ్యూ మూవీ. ఆ చిత్రంలో దునియా విజయ్ హీరోగా నటించాడు. వరుణ్ సందేశ్ హీరోగా విడుదలైన చమ్మక్ చల్లో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. Photo: Instagram
దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి జంటగా ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో ఎంపిక చేశాడు. ఈ చిత్రంలో అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరు అమ్మాయిలు ఓ మోస్తరు విజయం అందుకుంది. Photo: Instagram
పైసా, ఎర్రబస్సు, రుద్రమదేవి.. ఇలా వరుస చిత్రాలు చేసింది. సరైనోడు రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. Photo: Instagram
గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన క్యాథరిన్… జయజానకీ నాయక చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ఒక దశలో వరుసగా తమిళ్ చిత్రాలు చేసింది. వరల్డ్ ఫేమస్ లవర్ తో తెలుగులోకి మరలా రీ ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram
బింబిసార, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన కేథరిన్ విజయాలు అందుకుంది. మాచర్ల నియోజకవర్గం మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం కేథరిన్ చేతిలో అధికారికంగా ఎలాంటి తెలుగు చిత్రం లేదు. Photo: Instagram
అయితే అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా రెడ్ బికినీ ధరించి సిమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడింది. తడిసిన శరీరంలో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. కేథరిన్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. Photo: Instagram