Anchor Ravi
Anchor Ravi: టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు రవి. ఇప్పటివరకు యాంకర్ రవి అనేక షోలు హోస్ట్ చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చాలా కాలంగా బుల్లితెర పై తన హవా సాగిస్తున్నాడు. అయితే రవి పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా చాలా విమర్శలు ఎదర్కొన్నాడు. తనపై నిత్యం ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉండేవి. ముఖ్యంగా అప్పట్లో యాంకర్ లాస్య – యాంకర్ రవి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ కలిసి ఓ షో హోస్ట్ చేయడం ఈ పుకార్లకు కారణం అయ్యింది.
అయితే ఈ పుకార్ల వల్ల రవి తన పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ముఖ్యంగా రవి భార్యకు దారుణమైన అవమానం జరిగిందట. ఏ మహిళకు రాకూడని క్లిష్టమైన పరిస్థితి ఆమెకు ఎదురైందట. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రవి పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోలో రవి పాల్గొన్నాడు. ఈ క్రమంలో రీతూ పలు ఆసక్తికర విషయాల తెరపైకి తెచ్చింది.
మీరు పక్కా కమర్షియల్ అట కదా… అని రీతూ అడిగింది. అవును 100 శాతం నేను కమర్షియల్. ఎందుకంటే నాకు వచ్చిన పనిని డబ్బు తీసుకొని మాత్రమే చేస్తానని యాంకర్ రవి అన్నారు. నీకు పెళ్ళైన సంగతి ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? అని రీతూ ప్రశ్నించింది. దీనికి రవి ఏం చెప్పాడు అన్నది ప్రోమోలో సస్పెన్స్ గా చూపించారు. ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ క్రమంలో లాస్యతో ఎఫైర్ రూమర్స్ వస్తున్న క్రమంలో… తన భార్యకు జరిగిన సంఘటన గురించి రవి బయటపెట్టాడు.
రవి మాట్లాడుతూ … నా భార్యతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ కొందరు .. రవి భార్య ఆ యాంకర్ కదా నువ్వేంటి నా మొగుడు అంటూ చెప్పుకుని తిరుగుతున్నావు అంటూ నా భార్యని అడిగారట. దీంతో తను భరించలేక పోయింది. చాలా బాధ పడింది. ఏ భార్య అయినా తన భర్త ని మరొకరికి భర్త అంటే సహించలేదు. ఆ రూమర్స్ వల్ల దారుణమైన అవమానాలు ఎదురయ్యాయి అంటూ రవి చెప్పుకొచ్చాడు.
Web Title: Anchor ravi sensational comments are going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com