బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మొదట్లో యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా స్టార్ అయ్యింది. ఆమె పలు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించింది. Photo: Instagram
ఆ పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 5 లో ఛాన్సు దక్కించుకుంది. హౌస్ లో సత్తా చాటింది. ఫైనల్ కి చేరుకుని టాప్ 5 లో నిలిచింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో సిరి ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది. షణ్ముఖ్ జస్వంత్ తో సిరి చాలా సన్నిహితంగా మెలిగింది. Photo: Instagram
అప్పటికే శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సిరి... షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండటంపై ప్రేక్షకులు పెదవి విరిచారు. సిరి కారణంగానే షణ్ముఖ్ కి దీప్తి సునైన బ్రేకప్ చెప్పిందని ప్రచారం జరిగింది. ఇది పక్కన పెడితే . ప్రస్తుతం సిరి నటిగా, యాంకర్ గా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ లో సిరి కి అవకాశం దక్కడం విశేషం. ఇందులో చిన్న పాత్రలో సిరి కనిపించింది. Photo: Instagram
కొన్నాళ్లుగా సిరి జబర్దస్త్ యాంకర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీరియల్ నటి సౌమ్య రావు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి సిరి హన్మంత్ వచ్చింది. తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. Photo: Instagram
సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ జబర్దస్త్ యాంకర్ లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. Photo: Instagram
తాజాగా సిరి హన్మంత్ పింక్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి ఫోటో షూట్ చేసింది. శారీలో సిరి చాలా అందంగా కనిపిస్తుంది. చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. క్యూట్ గా స్మైల్ చేస్తూ కనిపిస్తున్న సిరి హన్మంత్ ఫోటోలు కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జబర్దస్త్ బ్యూటీ అందాలు నెట్టింట వైరల్ గా మారాయి. Photo: Instagram
Web Title: Siri hanmanth looks glamorous in her latest pics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com