Allu Arjun: అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నేనంటే నా భార్యకు పెద్దగా ఇష్టం లేదు. వన్ సైడ్ లవ్ నాది. ఎప్పుడూ నేను ప్రేమించడమే అంటూ బాంబు పేల్చాడు. ఆర్య 20 ఇయర్స్ వేదిక సాక్షిగా ఈ పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ ఆర్య. గంగోత్రి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అల్లు అర్జున్ లుక్స్, యాక్టింగ్ పరంగా విమర్శల పాలయ్యాడు.
సదరు విమర్శలకు చెక్ పెడుతూ ఆర్య మూవీతో ఆయన కమ్ బ్యాక్ అయ్యాడు. ఆర్య చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ లు యువతను ఊపేశాయి. దర్శకుడు సుకుమార్ కి ఇది డెబ్యూ మూవీ కాగా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఓవర్ నైట్ స్టార్డం వచ్చి పడింది. అల్లు అర్జున్ కెరీర్లో ఆర్య చిత్రానికి ఇంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో 20 ఏళ్ల వేడుక నిర్వహించారు. ఆర్య 2004లో విడుదల కాగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.
ఆర్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాగా.. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ ని కొత్తగా చెప్పాడు సుకుమార్. కాగా ఆర్య 20 ఇయర్స్ వేడుకలో అల్లు అర్జున్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. మీ జీవితంలో వన్ సైడ్ లవ్ గురించి చెప్పాలని యాంకర్ అడగ్గా… నాకు ఎప్పటికీ వన్ సైడ్ లవ్ స్నేహతోనే అన్నాడు. నేను ఆమెను ప్రేమించడమే కానీ.. అటువైపు నుండి ఏమీ ఉండదు అంటూ… షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అల్లు అర్జున్ మాటలను బట్టి చూస్తే… స్నేహకు నేనంటే అంత ఇష్టం లేదు. నేను మాత్రం ఆమెను విపరీతంగా ప్రేమిస్తాను అని చెప్పినట్లుగా ఉంది. అయితే ఈ కామెంట్స్ అల్లు అర్జున్ సరదాగా చెప్పి ఉండవచ్చు. మాటల్లో మాటగా నవ్వుతూ అల్లు అర్జున్ వేదిక మీద అన్నారు. కాగా 2012లో స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ వేడుకలో కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయమైంది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అల్లు అర్జున్ తన ప్రేమ విషయం అల్లు అరవింద్ కి చెప్పి ఒప్పించాడు. స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి సంబంధం మాట్లాడినా… సినిమా వాళ్లకు పిల్లను ఇవ్వము అన్నారట. స్నేహారెడ్డి పట్టుబట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్ ని అల్లుడిని చేసుకునేందుకు అంగీకరించారట. అల్లు అర్జున్స్-స్నేహారెడ్డిలకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి పేరు అర్హ.