మాళవిక మోహనన్ గ్లామర్ షో విషయంలో హద్దులు దాటేస్తుంది. అంతకంతకు అమ్మడు డోసు పెంచేస్తుంది. బికినిలో మిర్రర్ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాళవిక గ్లామరస్ లుక్ వైరల్ గా మారింది. Photo: Instagram
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయిన మాళవిక మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. అనంతరం హీరోయిన్ గా మారింది. 2013లో విడుదలైన మలయాళ చిత్రం పట్టం పోలె ఆమె డెబ్యూ మూవీ. పరిశ్రమలో అడుగుపెట్టి చాలా కాలం అవుతున్నా చేసింది తక్కువ చిత్రాలే. Photo: Instagram
రజినీకాంత్ పేట మూవీలో ఓ కీలక రోల్ చేసింది. అనూహ్యంగా విజయ్ కి జంటగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ చిత్రంలో మాళవిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. Photo: Instagram
మాస్టర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే విజయ్ తో ఆమె పాత్రకు పెద్దగా రొమాన్స్, కెమిస్ట్రీ ఉండదు. దాని వలన ఆమెకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ ఊపందుకుంటుంది. క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. Photo: Instagram
మాళవిక చేతిలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ రాజా సాబ్. ప్రభాస్ కి జంటగా ఈ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు. రాజా సాబ్ మూవీలో మాళవిక ఫైట్స్ కూడా ఇరగదీయడం విశేషం. ఆ మధ్య మాళవిక మార్కెట్ సెట్ లో రౌడీలను దుమ్మురేపుతున్న ఓ వీడియో లీక్ అయ్యింది. Photo: Instagram
రాజా సాబ్ హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అలాగే విక్రమ్ కి జంటగా తంగలాన్ మూవీ చేస్తుంది. ఈ ప్రయోగాత్మక చిత్రంలో ఆమె డీగ్లామర్ రోల్ చేస్తుంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఒక బాలీవుడ్ మూవీ చేస్తుంది. Photo: Instagram