బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేసింది. ఒకే సీజన్ లో రెండు సార్లు అవకాశం వచ్చినప్పటికి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. గేమ్ కంటే కాంట్రవర్సీల మీద ఫోకస్ చేసిన రతిక రోజ్ పెద్దగా ప్రభావం చూపలేదు. Photo: Instagram
రతిక రోజ్ నటిగా కెరీర్ ప్రరంభించింది. చిన్నా చితకా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. తన అందం, గ్లామర్ తో కట్టిపడేసింది. Photo: Instagram
మొదటి రెండు వారాలు చాలా బాగా గేమ్ ఆడింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపింది. ఈ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. కానీ రతిక ఉన్నట్టుండి ప్లేట్ మార్చేసింది. ప్రశాంత్ ని తిడుతూ యావర్ తో రొమాన్స్ మొదలుపెట్టింది. ఇది ఆమెకు బాగా మైనస్ అయింది. Photo: Instagram
సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ పెరగడంతో నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. రతిక రోజ్ తన ఎలిమినేషన్ ఊహించలేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో ఆమె ప్రవర్తన విమర్శల పాలైంది. బిగ్ బాస్ ఆమెకు రెండో ఛాన్స్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ ఓట్ల ఆధారంగా రీ ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram
ఆ చాన్సు కూడా సరిగా ఉపయోగించుకోలేదు. ట్రోలింగ్ కి గురైంది. నెగిటివ్ అయినప్పటికీ రతిక క్రేజ్ మాత్రం బాగా పెరిగింది. ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. బయటకు వచ్చిన తర్వాత రతిక కు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రతిక సందడి చేస్తుంది. తన గ్లామరస్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా గ్రీన్ శారీ లో కనువిందు చేసింది. Photo: Instagram
చిలకపచ్చ చీర కట్టి వయ్యారం ఒలకబోసింది. ఫోటోలకు ఫోజులిస్తూ హొయలు పోయింది. రతిక న్యూ లుక్ ఆకట్టుకుంటుంది. ఆమె అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రతిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన ' భగవంత్ కేసరి ' లో రతిక చిన్న పాత్రలో మెరిసింది. ఎమ్మెల్యే కి పీఏ గా నటించింది. ప్రస్తుతం పలు సినిమాలు రతిక చేతిలో ఉన్నట్లు సమాచారం. Photo: Instagram
Web Title: Rathika rose looks stunning in traditional wear
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com