spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: మేం తిడతాం.. మీరు చూపించొద్దు.. బూతుల నియంత్రణకు రేవంత్‌ చిట్కా!

CM Revanth Reddy: మేం తిడతాం.. మీరు చూపించొద్దు.. బూతుల నియంత్రణకు రేవంత్‌ చిట్కా!

CM Revanth Reddy: రాజకీయాల్లో కొన్నేళ్లుగా బూతుపురాణం విపరీతంగా పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో ఊపు తెచ్చేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దానిని కొనసాగించడం మొదలు పెట్టారు. అధికారంలో ఉన్నా కూడా సీఎంస్థాయిలో ఉండి కూడా విపక్ష నేతలపై నోరు పారేసుకోవడం కొనసాగించారు. దీంతో విపక్ష నేతలు కూడా ఆయనకు అదే రీతిలో సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నారు. దీంతో తెలంగాణలో అన్ని పార్టీల్లో బూతు పురాణం సంస్కృతి వ్యాపించింది. ఇది ఇప్పుడు ఏపీకి కూడా వెళ్లింది. అమ్మ మొగుడు.. తాతా మొగుడు లాంటి పదాలు వాడుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఈ బూతుపురానం నియంత్రణకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు ఓ చిట్కా చెప్పారు. అదేంటో తెలుసుకుందాం.

వాళ్లను చూపించొద్దట..
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్‌టీవీకి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగాఎడిటర్‌ రాజకీయాల్లో బూతు నియంత్రణకు తీసుకునే చర్యల గురించి ప్న్రంచారు. దీనికి సీఎం ఓ చట్కా చెప్పారు. రాజకీయాల కోసం నాయకులు అలాంటి భావ వాడుతుంటారట. కానీ, ఆమాటలను టీవీల్లో చూపించడం ద్వారా దాని ఇంపాక్ట్‌ ప్రజలపై పడుతుందని తెలిపారు. అందుకే బూలు మాట్లాడిన నేతలను మీడియాలో చూపించొద్దని సూచించారు.

ఒకరిద్దరిని అరెస్టు చేస్తారట..
ఇక మరో అడుగు ముందుకేసి.. ఇలాంటి వీడియోలు చూపించకుండా ఉండేందకు.. ముందుగా టీవీల యజమానులను ఒకరిద్దరిని జైలుకు పంపాలని తెలిపారు. రాజకీయ నాయకులు పార్టీలకు మైలేజీ తేవడానికి మాట్లాడుతుంటారని, మీడియాకు సామాజిక బాధ్యత ఉన్నందున వాటిని చూపకుండా ఉండాలని పేర్కొన్నారు. మీడియా చూపడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. మీడియా సామాజిక బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.

రాజకీయాలు అంటేనే పబ్లిక్‌ లైఫ్‌..
ఇదిలా ఉంటే.. రేవంత్‌ మీడియా నియంత్రణకు సూచనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలన్న ఉద్దేవంతోనే మీడియా అన్ని విషయాలను కవర్‌ చేస్తుంది. వాళ్లు నియంత్రణలో ఉంటామని చెప్పడం మానేసి మీడియా వాళ్లను జైలుకు పంపుతామనడం ఏమేరకు సమంజసం అన్న చర్చ జరుగుతోంది. నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్న నేతలను మొదట జైల్లో పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒకరిద్దరు నేతలను జైల్లో పెడితే.. మిగతా వారు మాట్లాడడం మానేస్తారని పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper