జాన్వీ కపూర్ సౌత్ ఇండియాను ఏలే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో బ్రేక్ రాకున్నా సౌత్ లో ఆమెకు రెండు భారీ ప్రాజెక్ట్స్ దక్కాయి. ఎన్టీఆర్ కి జంటగా దేవర మూవీ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. Photo: Instagram
దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కొరటాల శివ చెప్పడం విశేషం. దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. Photo: Instagram
దేవర విడుదల కాకుండానే రామ్ చరణ్ సినిమాకు జాన్వీ కపూర్ సైన్ చేసింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ చిత్ర దర్శకుడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర కుర్రాడిగా రామ్ చరణ్ రోల్ ఉంటుందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా జాన్వీ కపూర్ కెరీర్ మరో మలుపు తిరగడం ఖాయం. Photo: Instagram
హిందీలో జాన్వీ కపూర్ చిన్న చిత్రాలు చేసింది. స్టార్ హీరోల పక్కన ఆమెకు ఛాన్స్ రాలేదు. సౌత్ వాళ్ళు మాత్రం ఆమెకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు కారణం... ఆమె శ్రీదేవి కూతురు కావడమే. Photo: Instagram
చెన్నైలో పుట్టిన శ్రీదేవి తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని హీరోయిన్ గా పరిశ్రమను ఏలింది. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా తన మార్క్ క్రియేట్ చేసింది. Photo: Instagram
ఎన్టీఆర్, చిరంజీవితో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి కూతురు వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో నటించడం విశేషం. మరోవైపు మోడల్ గా రాణిస్తుంది జాన్వీ కపూర్. ఇంస్టాగ్రామ్ లో జాన్వీ కపూర్ ఫోటో షూట్స్ చూస్తే నిద్ర కరువే. తాజాగా ఆమె బ్లాక్ కలర్ వైట్ చెక్స్ తో కూడిన షార్ట్ ఫ్రాక్ ధరించింది. Photo: Instagram
జాన్వీ కపూర్ లుక్ చాలా హాట్ గా ఉంది. కాగా ఆ డ్రెస్ ధర తెలిశాక జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. జాన్వీ ధరించి ఆ డ్రెస్ ధర రూ. 1.7 లక్షలు అట. ఒక సామాన్యుడు ఏడాది కాలానికి కుటుంబం మొత్తానికి సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు కదా... Photo: Instagram
Web Title: Janhvi kapoor stunning photoshoot stills
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com