Meet actress: నటుడితో ఎఫైర్, పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ… స్టార్ క్రికెటర్ వైఫ్ ఎవరో తెలుసా?
2013లో విడుదలైన సత్యాగ్రహ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, కరీనా కపూర్, అమితాబ్ కీలక రోల్స్ చేశారు.
Written By:
S Reddy , Updated On : May 2, 2024 11:53 am
Who is Hardik Pandya wife Natasa Stankovic
Follow us on
పెళ్లికి ముందే సహజీవనం చేసి తల్లి అయ్యింది నటి నటాషా స్టాన్కోవిక్. సెర్బియా దేశానికి చెందిన నటాషా ఇండియాలో కెరీర్ ని వెతుకున్నారు. నటిగా, మోడల్ గా రాణిస్తుంది. Photo: Instagram
2013లో విడుదలైన సత్యాగ్రహ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, కరీనా కపూర్, అమితాబ్ కీలక రోల్స్ చేశారు. నటాషా స్పెషల్ నెంబర్ చేసింది. Photo: Instagram
నటాషా నటిగా కంటే కూడా వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా పాప్యులర్ అయ్యింది. కోవిడ్ సమయంలో నటాషా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తో సహజీవనం చేసింది. గర్భం దాల్చింది. Photo: Instagram
నటాషా హార్దిక్ పాండ్యా కంటే వయసులో ఏడాదిన్నర పెద్దది. కాగా హార్థిక్ పాండ్యా కంటే ముందు బుల్లితెర నటుడు అలీ గోని తో చాలా కాలం డేటింగ్ చేసింది. అతనితో కలిసి ఓ టీవీ షో చేసింది. Photo: Instagram
అలీ గోని తో నటాషాకు మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పింది. మావి భిన్నమైన సంస్కృతులు అందుకే విడిపోయామని అనంతరం వారు వివరణ ఇచ్చారు. అనంతరం హార్దిక్ పాండ్యాకు ఆమె దగ్గరయ్యారు. Photo: Instagram
ముందు సహజీవనం చేసి తల్లైన నటాషా, హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. నటాషా బిగ్ బాస్ హిందీ సీజన్ 8లో పాల్గొంది. 2014లో ప్రసారమైన ఈ సీజన్లో నటాషా పెద్దగా రాణించలేదు. ఆమె 28వ రోజు ఎలిమినేట్ అయ్యింది. Photo: Instagram
నటాషా బాలీవుడ్ చిత్రాల్లో ఐటెం నెంబర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. ఫుర్కి రిటర్న్స్, డాడీ, ఫ్రైడే, లుప్ట్ జీరో, ది బాడీ వంటి చిత్రాల్లో ఆమె స్పషల్ సాంగ్స్ చేసింది. ఫ్లెష్ టైటిల్ తో విడుదలైన వెబ్ సిరీస్లో నటాషా నటించారు. Photo: Instagram