HBD Ram Charan : మెగాస్టార్ ఇంట్లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు.. పవన్ కళ్యాణ్ తో పాటుగా హాజరైన టాలీవుడ్ స్టార్ హీరోలు

HBD Ram Charan : నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు.ప్రతీ ఏడాది జరిగే పుట్టిన రోజు వేడుకలకంటే కూడా ఈసారి కనీవినీ ఎరుగని రేంజ్ లో అభిమానులు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను జరిపారు.ఎందుకంటే #RRR చిత్రం తో రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఆయనకీ వచ్చినంత ఫేమ్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ […]

  • Written By: Naresh
  • Published On:
HBD Ram Charan : మెగాస్టార్ ఇంట్లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు.. పవన్ కళ్యాణ్ తో పాటుగా హాజరైన టాలీవుడ్ స్టార్ హీరోలు

HBD Ram Charan : నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు.ప్రతీ ఏడాది జరిగే పుట్టిన రోజు వేడుకలకంటే కూడా ఈసారి కనీవినీ ఎరుగని రేంజ్ లో అభిమానులు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను జరిపారు.ఎందుకంటే #RRR చిత్రం తో రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగిపోయింది.

ఆయనకీ వచ్చినంత ఫేమ్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్ కి కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అందుకే రామ్ చరణ్ ని చూసి ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో మురిసిపోతున్నాడు.తాను కూడా సాధించలేకపోయిన ఎన్నో రేర్ రికార్డ్స్ ని రామ్ చరణ్ సాదిస్తుండడం చూసి తండ్రిగా ఆయన పొందుతున్న ఆనందం మాటల్లో చెప్పలేనిది.అందుకే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను తన ఇంట్లో ఘనంగా జరిపించాలని అనుకున్నాడు.

ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన టాప్ స్టార్ హీరోలందరిని ఆహ్వానించాడట చిరంజీవి.నేడు రాత్రి వీళ్ళందరూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దర్శనం ఇవ్వనున్నారు.పవన్ కళ్యాణ్ తో పాటుగా అల్లు అర్జున్, మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , రానా , అక్కినేని నాగార్జున ఇలా ప్రముఖులందరూ హాజరు కాబోతున్న ఈ పార్టీ కోసం కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు, అందరి హీరోల అభిమానులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే తమకి ఇష్టమైన టాలీవుడ్ హీరోలందరినీ ఒకే చోట కలిసి చూడబోతున్నందుకు.ఈ పార్టీ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం సోషల్ మీడియా లో విడుదల కానుంది.రామ్ చరణ్ తన జీవితం లో మర్చిపోలేని విధంగా గ్రాండ్ గా ఈ ట్రీట్ ని ఇవ్వబోతున్నాడట మెగాస్టార్.

సంబంధిత వార్తలు