Homeక్రీడలుక్రికెట్‌Sunrisers Hyderabad: ప్రత్యర్థులకు సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరిక

Sunrisers Hyderabad: ప్రత్యర్థులకు సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరిక

తాజాగా హైదరాబాద్‌ జట్టు ఉప్పల్‌ స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతులు(9.4 ఓవర్లలో)ఆడి ఛేదించింది. తద్వారా ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసి పరుగులు చేయడమే కాదు.. ఛేసింగ్‌లోనూ తక్కువ బంతుల్లో ఛేదిస్తామని మరో సందేశాన్ని తన ప్రత్యర్థులకు పంపించింది.

Sunrisers Hyderabad: ఐపీఎల్‌ సీజన్‌ 18లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) రికార్డులు సృష్టించడమే కాదు.. తన రికార్డులను తనే తిరగరాస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ 287 నమోదు చేసింది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేస్తే 300 పరుగులు చేయడం తమకు కష్టం కాదని ప్రత్యర్థులకు ఓ సందేశం ఇచ్చింది.

58 బంతుల్లో 166 పరుగులు..
ఇక తాజాగా హైదరాబాద్‌ జట్టు ఉప్పల్‌ స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతులు(9.4 ఓవర్లలో)ఆడి ఛేదించింది. తద్వారా ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసి పరుగులు చేయడమే కాదు.. ఛేసింగ్‌లోనూ తక్కువ బంతుల్లో ఛేదిస్తామని మరో సందేశాన్ని తన ప్రత్యర్థులకు పంపించింది.

ప్లేఆఫ్‌లో ఇలా ఆడితే..
ఇక లీగ్‌ దశలో ఆడిన ఆటను ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌లో ఆడితే ఐపీఎస్‌ –2024 సీజన్‌ 18 టైటిల్‌ కొట్టడం ఖాయం అంటున్నారు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పది చట్లు 12 మ్యాచ్‌లు ఆడేశాయి. ఇంకా తలా రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్‌కు వెళ్లే మూడు జట్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. కోల్‌కత్తా, రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో స్థానం చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నాలుగో స్థానం కోసం చెన్సై, లక్నో, పంజాబ్‌ పోటీ పడుతున్నాయి. మరో మ్యాచ్‌ తర్వాత తుదిజట్లు ఖరారావుతాయి.

ప్లేఆఫ్‌ జట్లకు హెచ్చరిక..
ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌కు చేరిన జట్లుకు ఓ హెచ్చరిక పంపింది. తాము మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేయడమే కాదు.. తక్కువ ఓవర్లలో భారీ టార్గెట్‌ను ఛేదిస్తామని స్పష్టం చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper