సమ్మర్ వచ్చిదంటే చాలు చల్లని కొండ ప్రదేశాలకు చెక్కేస్తారు సెలెబ్రిటీలు. యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సైతం సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ప్రకృతిని ఆస్వాదిస్తోంది. కొండపై కూర్చుని స్వచ్ఛమైన పిల్లగాలిలో సేద తీరుతోంది. ప్రియా ప్రకాష్ వారియర్ తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. Photo: Instagram
వైట్ టాప్, డెనిమ్ షార్ట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ సూపర్ గ్లామరస్ గా ఉంది. పొట్టి నిక్కర్ లో అమ్మడి ఫోజులు కిక్ ఇస్తున్నాయి. ప్రియా ప్రకాష్ వారియర్ అభిమానులు ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo: Instagram
ప్రియా ప్రకాష్ వారియర్ కెరీర్ పరిశీలిస్తే ఒరు ఆడార్ లవ్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఒరు ఆడార్ లవ్ అంతగా ఆడలేదు. కానీ... ఆ చిత్రంలోని ఓ సీన్ విపరీతంగా వైరల్ అయ్యింది. క్లాస్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ కి ప్రియా ప్రకాష్ కన్ను కొట్టే సన్నివేశం వైరల్ గా... ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. Photo: Instagram
నితిన్ కి జంటగా చెక్ మూవీ చేసింది. ఈ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తేజ సజ్జ హీరోగా చేసిన ఇష్క్ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఈ చిత్రం కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. ముచ్చగా మూడో చిత్రం బ్రో చేసింది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ హిట్ టాక్ తెచ్చుకుంది. Photo: Instagram
బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ అక్కడ ఆఫర్స్ పట్టేస్తుంది. గత్ ఏడాది యారియార్ 2లో నటించింది. ప్రస్తుతం మూడు హిందీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రియా ప్రకాష్ వారియర్ ని 7 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. Photo: Instagram
Web Title: Priya prakash varrier stunning pictures
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com