Homeఅంతర్జాతీయంIndia: అత్యధికంగా విదేశాల నుంచి డబ్బు ఏ దేశానికి వస్తుందో తెలుసా? భారత్ వాటా ఎంతంటే?

India: అత్యధికంగా విదేశాల నుంచి డబ్బు ఏ దేశానికి వస్తుందో తెలుసా? భారత్ వాటా ఎంతంటే?

India: ప్రవాస భారతీయులు మన దేశంలోని వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు 2022లో 111 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.9.2 లక్షల కోట్లు) బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలివెళ్లి, వివిధ దేశాల్లో నివసిస్తున్నవారు, తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక ఏడాదిలో 1000 బిలియన్‌ డాలర్ల ప్రవాస నిధుల మైలురాయిని అందుకున్న తొలి దేశంగా కూడా భారత్‌ నిలిచిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేన్‌ తన నివేదికలో పేర్కొంది.

అత్యధికంగా నగదు పంపే దేశాలివీ..
ప్రవాసులు తమ దేశంలోకి అత్యధికంగా నగదు పంపే దేశాలను పరిశీలిస్తే మొదటి స్థానంలో భారత్, తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్సైన్స్, ప్రాన్స్‌ ఉన్నాయి. చైనా కొన్నేళ్లపాటు ద్వితీయస్థానంలో నిలవగా, 2021 నుంచి ఆ స్థానాన్ని మెక్సికో ఆక్రమించింది. 2022లో మెక్సికోకు ప్రవాసుల నుంచి 61 బిలియన్‌ డాలర్లు రాగా, చైనాకు 51 బిలియన్‌ డాలర్లు వెళ్లాయి.

2010 నుంచి భారత్‌కు ఇలా..
ఇక భారత్‌కు వస్తున్న ప్రవాస నిధులు పరిశీలిస్తే 2010లో 53.48 బలియన్‌ డాలర్లు, 2015లో 68.91 బిలియన్‌ డాలర్లు, 2020లో 83.15 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్, 2022లో 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

దక్షిణాసియా ప్రాంతం నుంచే ఎక్కువ..
దక్షిణాసియా ప్రాంతం నుంచి వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసుల నుంచి ఈ ప్రాంతమే ఎక్కువగా నిధులు అందుకుంటోందని ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్‌ విభాగం తెలిపింది. ్ర‘పవాసులు ఎక్కువగా నిధులు పంపిస్తున్న తొలి 10 దేశాల్లో దక్షిణాసియా ప్రాంతంలోని మూడు దేశాలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి కార్మిక వలసలూ అధికంగా ఉంటున్నాయి. 2022లో ప్రవాస నిధుల పరంగా పాకిస్తాన్‌ ఆరోస్థానంలో(30 బిలియన్‌ డాలర్లు), బంగ్లాదేశ్‌(21.5 బలియన్‌ డాలర్లు) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

గల్ఫ్‌ దేశాలకు అధికం..
వలస కార్మికులకు గల్ఫ్‌ దేశాలే ప్రధాన గమ్యస్థానాలుగా కొనసాగుతన్నాయని తాజా నివేదిక తెలిపింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మొత్తం జనాభాలో 88 శాతం వలస వచ్చిన ప్రజలే. కువైట్, ఖతార్‌లో ఈ సంఖ్య వరుసగా 72, 77 శాతంగా ఉంది. భారత్‌ నుంచి సుమారు 1.8 కట్లో లేదా 1,3 శాతం మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారిని, వీళ్లలో ఎక్కువ మంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాల్లో నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. మరోవైపు వలసలకు గమ్యస్థానంగా భారత్‌ 13వ స్థానంలో ఉంది. మొత్తంగా 44.80 లక్షల మంది భారత్‌కు వలస వచ్చారు. భారత్‌ నుంచి వలస వెళ్లినవారిలో పురుషులకన్నా మహిళల శాతమే స్వల్పంగా ఎక్కువని నివేదిక పేర్కొంది.

విద్యార్థులూ అక్కడి నుంచే..
ఇక ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య విషయంలోనూ ఆసియా దేశాలే ముందు వరుసలో ఉన్నాయి. 2021లో చైనా నుంచి 10 లక్షల మందికిపైగా విదాఉ్యర్థులు విదేశాలకు వెళ్లారు. ఈ విషయంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి 5,08,000 మంది విదేశాల బాట పట్టారు. వలస విద్యార్థులకు గ్యమస్థానాల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశానికి సుమారు 8,33,000 మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి చదవుకునేందుకు వెళ్లారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్‌(6,01,000), ఆస్ట్రేలియా(3,78,000), జర్మనీ(3,78,000), కెనడా(3,18,000) ఉన్నాయి. మరోవైపు రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, థాయ్‌లాండ్, పాకిస్తాన్, భారత్‌ వంటి దేశాల్లోని విద్యార్థులకు చైనా కూడా ప్రధాన గమ్యస్థానంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular