Anasuya Bharadwaj : బుల్లితెరపై స్టార్ యాంకర్ గా మార్క్ క్రియేట్ చేసింది అనసూయ. జబర్దస్త్ షో వేదికగా అనసూయ సంచనాలకు తెరలేపింది. పొట్టి బట్టలు ధరించి గ్లామర్ షో చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అనంతరం తనలోని ప్రతిభను బయటపెట్టి సినిమా అవకాశాలు దక్కించుకుంది. నటిగా కూడా సక్సెస్ అయింది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంటుంది. బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయి నటిగా కొనసాగుతోంది.
అయితే అనసూయ చదువుకునే రోజుల్లోనే నటిగా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఆమెకు ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. 2003 లో ఎన్టీఆర్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ నాగ విడుదలైంది. ఈ చిత్రంలో అనసూయ కనిపించింది. నాగ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ గా అనసూయ నటించడం విశేషం. అయితే ఆమెకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే ఆయన వెనుక అనసూయ కనిపిస్తుంది.
నాగ సినిమాలో ఆ పాత్ర చేసే నాటికి అనసూయ వయసు 19 ఏళ్ళు అట. ఆమె జూనియర్ కాలేజ్ లో చదువుతున్నారట. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను అనసూయకు రూ. 500 ఇచ్చారట. అదే అనసూయ సంపాదన కావడం విశేషం. అప్పట్లో రూ. 500 వందల కోసం జూనియర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం అనసూయ రేంజ్ ఏంటో తెలిసిందే. గత ఏడాది ఆమె అరడజనుకు పైనే సినిమాలు చేసింది.
ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తుంది. కాబట్టే అనసూయ సక్సెస్ అయింది ఇక అనసూయ చేతిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 ఉంది. ఇందులో విలన్ క్యారెక్టర్ లో కనిపించనుంది. సునీల్ భార్య, దాక్షాయణిగా మెప్పించనుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో అనసూయ నటిస్తుంది.