Mani Shankar Iyer: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు సొంత పార్టీ నేతలే తలనొప్పిగా మారుతున్నారు. ఇప్పటికే శామ్ పిట్రోడా వారసత్వ పన్ను అని ఒకసారి, ఇటీవల దక్షిణాది ప్రజల రంగు ఆధారంగా ఆఫ్రికన్లతో పోల్చి వివాదాస్పదమయ్యారు. చివరకు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వివాదం ఇంకా సమసిపోక ముందే.. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసి మరో తలనొప్పి క్రియేట్ చేశారు. పార్టీని ఇరుకున పడేశారు.
మణిశంకర్ ఏమన్నాడంటే..
పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని అందుకే దాయాది దేశాన్ని గౌరవించాలని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి తెరలేపాయి. భారత్–పాక్ సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ‘‘పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలి. అంతేగానీ సైన్యంతో రెచ్చగొట్టొద్దు. అలా జరిగగితే ఉద్రిక్తతలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ దేశం వద్ద పెద్ద అణుబాంబులు ఉఆన్నయి. అందువలన ఆ దేశాన్ని మనం గౌరవించాలని. వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుబాంబులు ప్రయోగించే ఆలోచన చేస్తారు. మన వద్ద ఆ అస్త్రాలు ఉన్నాయి. కానీ లాహోర్‌పై మనం ప్రయోగిస్తే దాని తాలూకు చేడియేషన్ అమృత్‌సర్ చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు’’ అని ఆ వీడియోలో వివరించారు.
ప్రవేటు కార్యక్రమంలో..
ఏప్రిల్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మణిశంకర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలాకోట్ దాడి గురించి ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పాక్‌ను పరోక్షంగా హెచ్చరించారు. భారత్‌కు హాని తలపెడితే వేటాడి మరీ హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. వీటిపై స్పందిస్తూనే అయ్యర్ ఇలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
మండిపడిన బీజేపీ..
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేస్తూ ‘‘ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వాస్తవ సిద్ధాంతం బయటపడుతోంది. పాకిస్థాన్‌కు అండగా ఉండడం, వారి మద్దతు తీసుకోవడం, అవసరమైతే సియాచిన్‌ను వదులుకోవడం, యాసిన్ మాలిక్ వంటి ముష్కరులకు, ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం అవినీతికి ఆల్పడడం, పేదల ప్రజల సొమ్ము దోచుకోవడం, విద్వేషంతో విభజన రాజకీయాలకు పాల్పడడం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఫణంగా పెట్టి ముస్లింలను బుజ్జగించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం, అబద్ధాలు, నకిలీ గ్యాంరటీలు ఇవ్వడం ప్రజలే తప్పుదోవ పట్టించడం ఇవే వారి సిద్ధాంతాలు’’ అని దుయ్యబట్టారు.
పార్టీకి సంబంధం లేదు..
ఇదిలా ఉండగా అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టంచేసింది. ‘అయ్యర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను మేం పూర్తిగా విభేదిస్తున్నాం. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ విధానాలను ప్రతిబింబించదు.’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.