Mahesh Babu-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు పలు రకాల సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటి వరకు ఈయన తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో చేయబోయే సినిమా ఏకంగా పాన్ వరల్డ్ లో తెరకెక్కిస్తున్నారు. అంటే ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాను దాటి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమాని చేయబోతున్నాడు.
ఇక ఇప్పటివరకు ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయని మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఆయన అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు అంటే అది తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది.ఇక ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేకోవర్ పనిలో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు.
ఇక రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకొని షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈనెల 31వ తేదీన కృష్ణ గారి బర్త్ డే రోజున ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసి సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికి జూన్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబుని ఫుల్ గా వాడుకోవడానికి రాజమౌళి రెడీగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి. ఇక రాజమౌళి సినిమా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక పట్టాన ఒప్పుకునేవాడు కాదు.
కాబట్టి ఒక సీన్ గాని, ఒక షాట్ గాని చేసినప్పుడు అందులో పర్ఫెక్షన్ అనేది పర్టికులర్ గా ఉండాలి. లేకపోతే మాత్రం ఆయన ఆ షాట్ ఓకే అయ్యేంతవరకు చేయిస్తూనే ఉంటాడు. అందుకే రాజమౌళితో సినిమా చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. కానీ ముందు అంతకు మించి ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది…