KTR: తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి నిరసన ఎదురైంది. ఈ ఘటన ద్వారా ప్రజలు, ఓటర్లు గత పాలకులపై ఎంత కసిగా ఉన్నారాన్న విషయం స్పష్టమైంది. అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అండగా ఉన్నామని, సీఎం కలవకపోయినా స్థానిక నేతలు ప్రజలను కలుస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారని నాటి ముఖ్యమైన మంత్రి హోదాలో పదేపదే చెప్పారు. కాని గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూసించారు భైంసా రామ భక్తులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లు నిర్వహించేందుకు భైంసా వచ్చిన కల్వకుంట్ల తారక రామారావుకు చుక్కలు చూపించారు.
జనం కన్నా నిరసనకారులే ఎక్కువ..
భైంసాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌కు జనం, బీఆర్‌ఎస్ శ్రేణులకన్నా.. నిరసనకారులే ఎక్కువగా హాజరయ్యారు. హనుమాన్ దీక్షాపరులు, గతంలో ఓ ఘర్షణలో ఓవర్గం దాడికి గురైన బాధితులు, ఇళ్లు కోల్పోయిన వారు వచ్చారు. కేటీఆర్ ఖబడ్దార్ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
ప్రసంగానికి జైశ్రీరాం జపంతో ఆటకం..
ఇక కేటీఆర్ వాటిని చూసి కూడా చూడనట్లు వ్యవహించారు. దీంతో కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు జైశ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. కేటీఆర్ మాటలు వినబడకుండా రామనామం జపించారు. దీంతో అసహనానికి గురైన కేటీఆర్ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన రామ భక్తులు ఉల్లిగడ్డలు, టమాటాలతో దాడిచేశారు. అప్రమత్తమైన ఆయన చుట్టూ ఉన్న నాయకులు కేటీఆర్‌కు తగలకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం కేటీఆర్ ఇదేనా రముడు చెప్పింది.. అని ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారు అని నిలదీశారు. భయపడుతున్నారా అని ప్రశ్నించారు. కార్నర్ మీటింగ్ కొనసాగే అవకాశం లేకపోవడంతో నిరాశగా వెనుదిగిరారు. పోలీసులు కూడా నిరసనకారులను చెదరగొట్టారు.
దాచేసినవారి అరెస్ట్..
ఇదిలా ఉండగా, కేటీఆర్‌పై ఉల్లిగడ్డలు, టమాటాలతో దాడిచేసిన వారిని అరెస్టు చేస్తున్నారు భైంసా పోలీసులు. గురువారం దాడి జరుగగా, శుక్రవారం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ముధోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు పోలీసుల తీరును తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేశాయని డిమాండ్ చేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Brs working president ktr was attacked by unknown persons at bhainsa road show
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com