AP Election Survey 2024: దేశమంతా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో ఏపీలో పార్లమెంటుతోపాటు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, విపక్షాలు టీడీపీ, జనసే, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తోపాటు చిన్న పార్టీలు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం అధికార వైసీపీ, విపక్ష కూటమి మధ్యే నెలకొంది. వైసీపీలో జగన్ అన్నీ తానై నడిపిస్తుండగా, కూటమి తరఫున చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్‌షా, నడ్డా, మోదీతోపాటు పలువురు బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. అనేది ఉత్కంఠగా మారింది. ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
వైసీపీ–కూటమి మధ్యే పోటీ..
ఏపీలో ప్రధాన పోటీ అధికార వైసీపీ, విపక్ష కూటమి మధ్యే ఉందని సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45 నుంచి 55 సీట్లు వస్తాయని వెల్లడించింది. దీంతో అధికార పార్టీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వే సంస్థ వెల్లడించింది.
లోక్‌సభ ఫలితాలు ఇలా..
ఇక లోక్‌సభ ఫలితాలను కూడా పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ వెల్లడించింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో 2024, మే 13న జరిగే ఎన్నికల్లో అధికార వైసీపీ 18 నుంచి 20 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇక విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 5 నంచి 7 సీట్లు వస్తాయని పేర్కొంది.
మొత్తంగా ఇటు రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని తెలిపింది.