RCB Vs PBKS 2024: సాధారణంగానే అతడు ఒక టెంపోలో ఉంటాడు. అనుకూలంగా మైదానం ఉండి.. బ్యాటింగ్ కు సహకరిస్తే చెలరేగిపోతాడు. అలానే గురువారం రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో శివతాండవం చేశాడు. మైదానంలో జూలు విధిల్చిన సింహం లాగా రెచ్చిపోయాడు. బ్యాట్ తో వీర విహారం చేశాడు. ఫలితంగా 47 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 8 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. తన స్టామినా ఏంటో మరొకసారి నిరూపించాడు. ఈ దశలోనే ఒంటి చేత్తో సిక్స్ కొట్టి సత్తా చూపించాడు.
ధర్మశాల వేదికగా గురువారం రాత్రి పంజాబ్ జట్టుతో బెంగళూరు తలపడింది. ప్లే ఆఫ్ ముందు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చూపింది. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. 7ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టి బ్యాటింగ్ పరాక్రమాన్ని చూపించాడు. ఐపీఎల్ లో 90+ కి పరుగులు చేసి సెంచరీ చేజార్చుకోవడం కోహ్లీకి ఇది రెండవసారి. 2013లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 99 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. 11 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐపిఎల్ లో కోహ్లీ 90+ రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 6 సిక్సర్లు కొట్టాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో కవెరప్ప బౌలింగ్లో వంటి చేత్తో సిక్స్ కొట్టాడు. సామ్ కరణ్ బౌలింగ్లో మోకాళ్లపై కూర్చుని భారీ సిక్స్ కొట్టాడు. ఇవి రెండు ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచాయి.
కవెరప్ప వేసిన ఏడవ ఓవర్ లో తొలి బంతిని కోహ్లీ ఒంటి చేత్తో స్టాండ్స్ కు తరలించాడు. అంతకుముందు కవెరప్ప బౌలింగ్లో కోహ్లీ రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఖాతా తెరవక ముందు, 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీకి రెండుసార్లు జీవదానం లభించింది. మొదటి ఓవర్లో కోహ్లీ షాట్ కొట్టేందుకు యత్నించి బంతిని గాల్లోకి లేపాడు. అయితే ఆ బంతిని అశుతోష్ అందుకోలేకపోయాడు. కవెరప్ప వేసిన మూడో ఓవర్ చివరి బంతికి కోహ్లీ బంతిని గాల్లోకి లేపాడు. ఈ దశలో రొసో క్యాచ్ వదిలేసాడు. షార్ట్ కవర్లో ఉన్న రొసో గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక అప్పటినుంచి కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. కోహ్లీ తర్వాత రజత్ పాటిదార్ 55, గ్రీన్ 46 పరుగులు చేయడంతో, బెంగళూరు 241 స్కోర్ చేసింది.
One handed six by King Kohli #ViratKohli #RCBvsPBKS #RCBvPBKS pic.twitter.com/V0EfxZ3UPB
— xmenn (@HinduForever00) May 9, 2024