Pawan Kalyan’s OG : రన్ రాజా రన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుజీత్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే తన ప్రతిభను చూపించుకొని ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. అయితే అది తెలుగులో పెద్దగా ఆడక పోయినా కూడా బాలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాబట్టి ఈ సినిమాని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ కి మధ్య కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట.
మరి ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సన్నివేశంలో ఇమ్రాన్ హష్మీ చెయ్యికి కొంచెం గాయం అయితే పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి తనను చూసుకొని తనకి ఏ ఇబ్బంది లేదు అని తెలిసిన తర్వాతే తను షూట్ చేయమని డైరెక్టర్ కి చెప్పాడట. నిజానికి పవన్ కళ్యాణ్ అప్పుడు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా ఆయన కోసం 5 గంటలు వెయిట్ చేస్తూ కూర్చున్నారట. ఇక ఆయన అంత బిజీగా ఉన్నా కూడా ఒక ఆర్టిస్ట్ కోసం అంత సేపు వెయిట్ చేయడం అనేది నిజంగా గ్రీట్ అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తన తోటి ఆర్టిస్ట్ లకి ఎంత గౌరవం ఇస్తారు అనేది ఇమ్రాన్ హష్మీ ప్రత్యక్షంగా చూసారట.
ఇక ఆ సెట్లోనే ఆయన మీరు చాలా గ్రేట్ అంటూ పవన్ కళ్యాణ్ కి చేతులెత్తి దండం కూడా పెట్టాడట. మీ గురించి వేరే వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా చూశాను. అందుకే మీరు స్టార్ హీరో అనే ట్యాగ్ ను దాటేసి ఎప్పుడో గొప్ప హీరో లిస్ట్ లోకి చేరిపోయారు అంటూ తను సెట్ లోనే అలాంటి మాటలు అనడం చూసిన సినిమా టీమ్ మొత్తం ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కూడా కొట్టారట.. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది…నిజానికి పవన్ కళ్యాణ్ ఏ ఆర్టిస్ట్ కి అయిన చాలా రెస్పెక్ట్ ఇస్తు చాలా బాగా మాట్లాడుతాడు. ఆయనకి మనుషులంటే ఇష్టం అందుకే అందరితో చాలా బాగా మాట్లాడుతాడు అంటూ ఎప్పుడు ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు…