spot_img
HomeతెలంగాణLok Sabha Elections 2024: మల్కాజిగిరి రివ్యూ : ఈటలకు ఎడ్జ్.. కాంగ్రెస్ స్వయంకృతాపరాధం!

Lok Sabha Elections 2024: మల్కాజిగిరి రివ్యూ : ఈటలకు ఎడ్జ్.. కాంగ్రెస్ స్వయంకృతాపరాధం!

Lok Sabha Elections 2024: తెలంగాణలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. మినీ ఇండియాగా గుర్తింపు ఉన్న మల్కాజ్‌గిరిలో గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమైన మల్కాజ్‌గిరిలో ఈసారి ఆ పార్టీ స్వయంకృతాపరాధమే ఆ పార్టీ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌కు సిట్టింగ్‌.. బీజేపీకి అడ్వాంటేజ్‌..
మల్కాజ్‌గిరిలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఆ పార్టీ సిట్టింగ్‌ స్థానం 2024 ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారిందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.

రాంగ్‌ క్యాండిడేట్‌..
కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా ఎంపిక చేస్తామని పట్నం మహేందర్‌రెడ్డి భార్య పట్నం సునీతను చేర్చుకున్నారు. కానీ, చివరి నిమిషంలో వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఆమెను మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కూడా స్థానికేతరుడే. కానీ పార్టీ నేతల నుంచి ఆయనకు సంపూర్ణ సహకారం అందుతోంది. బీసీ సామాజికవర్గం మద్దతు కూడా ఆయనకే ఉందని ప్రచారం జరుగుతోంది. పట్నం సునీతకు సొంత పార్టీనేతల నుంచి సహాయం అందడం లేదు. దీంతో నియోజకవర్గంలో ఆమె ప్రభావం చూపలేకపోతున్నారు.

ఎవరు గెలిచిన స్వల్ప మెజారిటీతోనే..
ఇక మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ పోటీ నామమాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. హోరాహోరీ పోరులు ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థి సునీతతోపాటు స్థానిక నేతలు ఇప్పుడు రేవంత్‌ చరిష్మాపైనే నమ్మకంతో ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper