Ram Charan: పాన్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా కొనసాగుతుంది. ఇక తెలుగులో మన స్టార్ హీరోలందరూ వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా తమదైన రీతిలో పాన్ ఇండియా లో సినిమాలను చేస్తున్నారు. ఇక అందులో కొంతమంది సక్సెస్ లు సాధిస్తే మరి కొంత మంది మాత్రం ఫెయిల్యూర్స్ ని మూటగట్టుకుంటున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయిన సూర్య, గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలైతే చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే మళ్లీ ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక వీటిని కనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీరిద్దరూ హీరోలుగా నటించే ఈ సినిమాకి ప్రస్తుతం సూర్య తో కంగువ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న శివ ఈ సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక చాలా రోజుల నుంచి ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఇది ఎంతవరకు నిజం అనే విషయాలైతే క్లారిటీగా తెలియదు. ఇక ఈ సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప దీని మీద సరైన క్లారిటీ అయితే రాదు. ఇక ఇది ఇలా ఉంటే సూర్య ప్రస్తుతం కంగువ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధించినట్లైతే సూర్య పాన్ ఇండియా లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందుతాడు.
ఇక రామ్ చరణ్ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ తో పాటు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరూ చాలా బిజీగా తమ కెరియర్ ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్రమంలోనే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తే పాన్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో తను కూడా ఒకడిగా నిలిచిపోతాడు…