అధికారికంగా అమరావతికి మంగళం!

రాజధాని అమరావతిని మార్చడం ఒక వంక హై కోర్ట్ పరిశీలనలో ఉండగా, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అధికారిక కార్యక్రలాపాలలో అమరావతి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నది. అంటే అనధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రభుత్వం గుర్తించడం లేదు. ప్రభుత్వం అధికారిక కార్యక్రలాపాలలో అమరావతి ఊసే ఎత్తడం లేదు. చివరకు ముఖ్యమంత్రికి సంబంధించిన పత్రికా ప్రకటనలలో కూడా అమరావతి పేరెత్తడం లేదు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇంటి వద్ద గాని, సచివాలయంలో గాని సమీక్షా సమావేశాలు […]

  • Written By: Neelambaram
  • Published On:
అధికారికంగా అమరావతికి మంగళం!


రాజధాని అమరావతిని మార్చడం ఒక వంక హై కోర్ట్ పరిశీలనలో ఉండగా, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అధికారిక కార్యక్రలాపాలలో అమరావతి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నది. అంటే అనధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రభుత్వం గుర్తించడం లేదు.

ప్రభుత్వం అధికారిక కార్యక్రలాపాలలో అమరావతి ఊసే ఎత్తడం లేదు. చివరకు ముఖ్యమంత్రికి సంబంధించిన పత్రికా ప్రకటనలలో కూడా అమరావతి పేరెత్తడం లేదు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇంటి వద్ద గాని, సచివాలయంలో గాని సమీక్షా సమావేశాలు జరుపుతూ ఉంటారు.

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సమావేశం జరిగినా అమరావతి పేరుతోనే పత్రికా ప్రకటనలు విడుదల అవుతూ ఉండెడివి. సచివాలయంలో జరిగిన ఏ కార్యక్రమంకు సంబంధించి అయినా అమరావతి అంటూ పేర్కొంటూ ఉండేవారు.

కానీ ఇప్పుడా పద్దతికి స్వస్తి పలికారు. ఇంటివద్ద జరిగే సమావేశాలకు తాడేపల్లి అని, సచివాలయంలో జరిగే సమావేశాలకు వెలగటూరు అని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల సూత్రంలో భాగంగా సచివాలయంను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఈ విధంగా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

సచివాలయం వద్దనే రాష్ట్ర శాసనసభ కూడా ఉండడం గమనార్హం. కానీ అమరావతిని శాసన సంబంధం రాజధానిగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అసెంబ్లీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను అసెంబ్లీ పేరుతోనే సాగిస్తామని అధికార వర్గాలు అంటున్నాయి.

సంబంధిత వార్తలు