Modi: దొడ్డి దాడిన దాడిచేయడం.. వెన్నుపోటు పొడవడం, దొంగదెబ్బతీయడంపై తనకు నమ్మకం లే దని, పదేళ్ల క్రితం పుల్వామా దాడికి ప్రతీకారంగా, దాయాది దేశం పాకిస్థాన్‌కు చెప్పి మరీ పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌పై దాడు చేశామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. శత్రువు ఎదురుగా నిలబడి కలబడడమే తనకు తెలుసన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిపిన వైమానిక దాడులు అప్పట్లో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా ముష్కరులకు మన వాయుసేన ముచ్చెమటలు పట్టించింది. తాజాగా ఎన్నికల్లోనూ ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్‌పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతనే మీడియాకు వెల్లడించినట్లు తెలిపారు.
ఎక్కడ నక్కినా వదిలిపెట్టం..
ఇది నవభారత్.. మనకు హాని తలపెట్టే ముష్కరులు వారి సొంత దేశంలో ఎక్కడ నక్కినా వేటాడి మరీ చంపేస్తాం. వెనుక నుంచి దెబ్బతీయడంపై మోదీకి నమ్మకం లేదు. శత్రువులో నిలబడి పోరాడతాం.2019నాటి బాటాకోట్ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టాలనుకోలేదు. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందుగా చెప్పాం అని ప్రధాని వివరించారు. ముందే మీడియాకు వెల్లడించాలని తాను మన బలగాళకు చెప్పానని, అంతకంటే ముదు పాకిస్థాన్‌కు ఈ విషయం చెప్పానన్నా. ఆ రోజు రాత్రి దాయాది దేశ అధికారులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. అందుకని, బలగాలను కొద్దిసేపు వేచిఉండమని చెప్పానని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతనే ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాం.. మోదీ దేనిని దాచిపెట్టడు. ఏది చేసిన బహిరంగంగానే చేస్తాడు అని తెలిపారు.
సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి..
2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీష్ జవాన్లను జైషే మహ్మద్ ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. దీనికి ప్రతీకంరంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని తాము ఎప్పటికీ సహించబోమని ఈ ఘటనతో భారత్.. పాక్ సహా ప్రపంచ దేశాలకు గట్టిగా సందేశం ఇచ్చింది. అయితే బాలాకోట్‌ఘటన జరిగిన రోజు ఉదయం భారత్‌పై ప్రతిదాడికి దిగింది పాక్. మన గగనతలంలోకి వారి యుద్ధవిమానాలు దూసుకొచ్చాయి. అయితే పాకిస్థాన్ చర్యను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే మిగ్ విమానం ఒకటి కూలి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రుచెరలో చిక్కారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత పాక్ అతడిని భారత్‌కు అప్పగించింది.