స్లీవ్ లెస్ జాకెట్ లో మైండ్ బ్లాక్ చేసింది సోనాల్ చౌహాన్. ఈ బాలీవుడ్ భామ సన్నజాజి తీగ వంటి సోయగాలు మైమరిపిస్తున్నాయి. సోనాల్ చౌహాన్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. Photo: Instagram
నటసింహం బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఉంది లెజెండ్. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ 2014లో విడుదలైంది. లెజెండ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల వేడుకలు నిర్వహించారు. Photo: Instagram
బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సోనాల్ చౌహాన్ తో పాటు నిర్మాతలు, లెజెండ్ మూవీలో నటించిన ఇతర నటులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లెజెండ్ 10 ఇయర్స్ ఈవెంట్ లో సోనాల్ చౌహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు రంగు డిజైనర్ శారీలో ఆమె అద్భుతంగా మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామర్ ఒలకబోసింది. Photo: Instagram
కాగా బాలయ్యకు సోనాల్ ఫేవరేట్ హీరోయిన్. ఆమెకు మూడు చిత్రాల్లో బాలకృష్ణ ఛాన్స్ ఇచ్చాడు. లెజెండ్ అనంతరం బాలయ్య హీరోగా తెరకెక్కిన డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో సోనాల్ చౌహాన్ జతకట్టింది. ఇవి రెండు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. Photo: Instagram
రైన్ బో సోనాల్ నటించిన మొదటి తెలుగు చిత్రం. పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో వంటి చిత్రాల్లో సోనాల్ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3లో కీలక రోల్ చేసింది. ఎఫ్ 3 ఆశించిన స్థాయిలో ఆడలేదు. Photo: Instagram
సోనాల్ చౌహాన్ ఆదిపురుష్ మూవీలో రావణాసురుడు భార్య మండోదరి పాత్ర చేయడం విశేషం. ప్రస్తుతం దర్ద్ టైటిల్ తో బెంగాలీ, హిందీ చిత్రం చేస్తుంది. గతంతో పోల్చితే సోనాల్ కి ఆఫర్స్ తగ్గాయి. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. సోనాల్ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది... Photo: Instagram