RCB Vs GT
RCB Vs GT: నిండా మునిగిన వాడికి చలి అక్కరలేదు. తెగించిన వాడికి ఎదురుదాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగళూరు జట్టు ఆడుతున్న తీరుకు పై సామెతలు సరిగ్గా సరిపోతాయి. ఎలాగూ ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు. అలా జరగాలంటే అద్భుతాలు ఆవిష్కృతం కావాలి. వాటిని నమ్ముకునే బదులు చివర్లోనైనా గెలుపులు సాధిస్తే.. వచ్చే సీజన్ కైనా కాస్తలో కాస్త పాజిటివిటీని పెంచుకోవచ్చన్నట్టుగా బెంగళూరు ఆడుతోంది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ బౌలర్ల మీద దీర్ఘకాలికంగా శత్రుత్వం ఉన్నట్టు కొడుతున్నాడు. అతడికి విల్ జాక్స్ తోడయ్యాడు. ఫలితంగా ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. శనివారం గుజరాత్ జట్టుతో సొంత మైదానంలో బెంగళూరు తలపడబోతోంది.
ఈ రెండు జట్లు ఈ సీజన్లో అహ్మదాబాద్ లో తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు బెంగళూరు ఎదుట 200 రన్స్ టార్గెట్ విధించింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 16.1 ఓవర్లలోనే కొట్టి పడేసింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును సొంత మైదానంలో మట్టి కరిపించింది. ఆ మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు విల్ జాక్స్ మెరుపు సెంచరీ తో ఆకట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్లను ఊచ కోత కోశాడు. శనివారం నాటి మ్యాచ్ లోనూ అతడు అదే తీరుగా ఆడతాడని బెంగళూరు జట్టు భావిస్తోంది. ఇప్పటికే జాక్స్ మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండలోనూ అతడు బ్యాట్ తో సాధన చేస్తున్నాడు. ఇక కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసేందుకు తహతహలాడుతున్నాడు. తీవ్రంగా సాధన చేస్తున్నాడు.
2022 సీజన్లో విజేత, గత ఏడాది రన్నరప్ గా గెలిచిన గుజరాత్.. ఈసారి ఆ స్థాయిలో ఆట ప్రదర్శించలేకపోతోంది. కొన్ని విజయాలు అందుకున్నప్పటికీ.. ఆ జట్టు కీలకమైన ప్లే ఆఫ్ దశమందు చేతులెత్తేస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ నిర్మించడం లేదు. వృద్ధి మాన్ సాహా ఓపెనర్ గా తేలిపోతున్నాడు. ఈ దశలో టైటాన్స్ జట్టు భారాన్ని సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ మోస్తున్నారు. బౌలింగ్ లోనూ గుజరాత్ జట్టు స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. ఇక ప్రస్తుతం గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే, అన్ని మ్యాచ్ లు గెలవాలి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆ జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక బెంగళూరు కూడా ప్లే ఆఫ్ వెళ్లాలంటే వరుస మ్యాచ్లలో గెలవాలి. భారీ రన్ రేట్ సాధించాలి. మిగతా జట్ల ఫలితాల కోసం ఎదురు చూడాలి.
జట్ల అంచనా ఇలా
బెంగళూరు
విరాట్ కోహ్లీ, డూ ప్లేసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మాక్స్ వెల్, గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ శర్మ, మహమ్మద్ సిరాజ్, యష్ డయాల్, స్వప్నిల్ సింగ్.
గుజరాత్
వృద్ది మాన్ సాహా, గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, ఓమర్ జాయ్, రాహుల్ తేవాటియ, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rcb vs gt playing xi prediction head to head stats key players pitch report and weather update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com