Uttar Pradesh: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. పూర్వాంచల్ ప్రాంతం.. అందులోని అజంగడ్, మీర్జాపూర్, వారణాసి డివిజన్లలోని పది జిల్లాల్లో ఇటీవల వైద్య సిబ్బంది రక్త పరీక్షలు చేశారు. ఇందులో 26 మందిలో హెచ్ఐవి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యవర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. అలా హెచ్ఐవీ సోకిన వారిలో 26 మంది వయసు 20 నుంచి 45 సంవత్సరాల మధ్యే ఉందట. ఇంతకీ వారికి హెచ్ఐవి ఎలా సోకిందో తెలుసుకునేందుకు.. వైద్య వర్గాలు ఆరా తీయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ప్రాంతంలో అజంగఢ్, మీర్జాపూర్, వారణాసి డివిజన్లోని పది జిల్లాల్లో 26, 890 మంది హెచ్ఐవి పాజిటివ్ బాధితులున్నారు. వీరికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినెల అక్కడి రాష్ట్ర సర్కార్ మందులతో పాటు, పింఛన్ కూడా అందిస్తోంది. వీరికి ప్రతినెల వైద్య సిబ్బంది రక్త పరీక్షలు చేస్తారు. అవసరమైన పౌష్టికాహారం కూడా అందజేస్తారు. అయితే ఇటీవల పై ప్రాంతాలలో వైద్య సిబ్బంది పర్యటించారు. కొంతమంది అనారోగ్యంగా ఉండడంతో వైద్య సిబ్బంది వద్ద చూయించుకున్నారు. వారు అనుమానం వచ్చి రక్త పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు రక్త పరీక్షలు చేసిన వారిలో 26 మందికి హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో చాలా మంది గతంలో పచ్చబొట్లు పొడిపించుకున్నారు. అందువల్ల వారికి హెచ్ఐవీ సోకిందని వారణాసి ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతి అగర్వాల్ ప్రకటించారు.
ఇటీవల పూర్వాంచల్ ప్రాంతంలో అజంగఢ్, మీర్జాపూర్, వారణాసి డివిజన్లలో పచ్చబొట్ల సంస్కృతి పెరిగిపోయింది. పచ్చబొట్లు పొడిచేవారు సూదులను వినియోగిస్తారు. ఈ సూదుల వల్ల హెచ్ఐవి సంక్రమణ జరిగిందని… అందువల్లే ఆ 26 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు అనుమానిస్తున్నారు. పదేపదే పచ్చబొట్లు పొడిపించుకోవడం వల్ల హెచ్ఐవి మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నమ్మకమైన వ్యక్తుల వద్ద మాత్రమే పచ్చబొట్లు పొడి పెంచుకోవాలని.. సాధ్యమైనంతవరకు అటువంటి సంస్కృతికి దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో పచ్చబొట్లు పొడిపించుకుంటే లేనిపోని రోగాలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఓకే సూదిని ఉపయోగించి అనేకమందికి పచ్చబొట్లు పొడవడం వల్ల హెచ్ఐవి లాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని.. అందువల్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Uttar pradesh hiv spread with tattoos in varanasi 26 youths identified as positive
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com