The Idea of You: ఓటీటీ కి ప్రాచుర్యం పొందాక అన్ లిమిటెడ్ కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. ఖాళీ సమయం దొరకాలే కానీ ప్రపంచంలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఇంట్లో కూర్చుని చూసేయొచ్చు. విభిన్నమైన జోనర్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాయి. భారత దేశంలో గత ఐదేళ్లలో ఓటీటీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. పల్లెలకు కూడా ఓటీటీ కల్చర్ వ్యాపించింది. హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ 5, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ దూసుకుపోతున్నాయి.
కాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఓ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. అయితే ఇది ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు అధికంగా ఉండే పెద్దోళ్ల సినిమా. కుటుంబంతో పాటు కలిసి చూడలేము. భార్య భర్తలు, సింగిల్స్ మాత్రం హ్యాపీగా చూడొచ్చు. అయితే కేవలం అలాంటి సన్నివేశాలకు చిత్రం పరిమితం కాదు. అద్భుతమైన కథ, కథనాలు, భావోద్వేగాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సినిమా చాలా ప్రత్యేకం.
ఈ ఇంగ్లీష్ మూవీ పేరు ‘ఐడియా ఆఫ్ యూ”. ఈ చిత్రంలో ఆస్కార్ విన్నర్ అన్నీ హాథ్ వే లీడ్ రోల్ చేయడం విశేషం. ఆమెతో రిలేషన్ పెట్టుకున్న కుర్రాడి పాత్రలో నికోలస్ గాలిట్జైన్ నటించాడు. ఇది 24 ఏళ్ల కుర్రాడికి 40 ఏళ్ల మహిళకు మధ్య జరిగేక కథ. ప్రపంచంలోని అందమైన అబ్బాయిలు గల మ్యూజిక్ బ్యాండ్ లో సింగర్ గా ఉన్న అబ్బాయిని భర్త లేని సింగిల్ మదర్ ప్రేమిస్తుంది.
అనుకోకుండా జరిగిన వీరి పరిచయం ఫిజికల్ రిలేషన్ షిప్ కి దారి తీస్తుంది. తమ బంధాన్ని వాళ్ళు ఎంతగానో ఆస్వాదిస్తారు. అయితే ఆ కుర్రాడు చాలా పేరున్న మ్యూజిక్ బ్యాండ్ సింగర్. దాంతో మీడియా వీళ్ళను వెంటాడుతుంది. వారిద్దరి ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లో కి వచ్చేస్తుంది. అప్పుడు వారి మధ్య ఏర్పడిన సంఘర్షణ ఏమిటి? వారి బంధం ఎలా ముగిసింది? అనేది చిత్ర కథ. ఐడియా ఆఫ్ యూ ప్రైమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.