Guess The Actress: ఫోటోలో ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం హాట్ బ్యూటీ. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన బోల్డ్ హీరోయిన్. ముంబైకి చెందిన ఈ ఉంగరాల జుట్టు భామ తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసింది. హిందీలో రెండు చిత్రాల్లో నటించింది. చూడగానే కిక్ ఇచ్చే అందం ఆమె సొంతం. మత్తు కళ్ళతో గిలిగింతలు పెడుతుంది. అందం, అభినయం ఉన్నా స్టార్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఆమెకు సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఇంతకీ ఆ పాప ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టమే కావచ్చు. కొందరు మాత్రం అంచనా వేసి ఉంటారు.
ఆ చిట్టి పాప ఇప్పటి సీరత్ కపూర్. పసిప్రాయంలో ఉన్న సీరత్ కపూర్ ఫోటో వైరల్ అవుతుంది. 2014లో విడుదలైన జిడ్ అనే హిందీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. రెండో చిత్రం హీరోయిన్ గా తెలుగులో చేసింది. సాహో ఫేమ్ సుజీత్ రన్ రాజా రన్ మూవీతో దర్శకుడు అయ్యాడు. ఆ మూవీ హీరోయిన్ గా సీరత్ కపూర్ ని ఎంపిక చేశారు.
శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సూపర్ హిట్ కొట్టింది. రన్ రాజా రన్ క్రైమ్ అండ్ రివేంజ్ డ్రామా గా తెరకెక్కింది. అలాగే రన్ రాజా రన్ చిత్రానికి సుజీత్… లవ్, రొమాన్స్ కూడా జోడించాడు. అనంతరం సందీప్ కిషన్ కి జంటగా టైగర్ మూవీ చేసింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నాగార్జున, సమంత ప్రధాన పాత్రలు చేసిన రాజుగారి గది మూవీలో సీరత్ కపూర్ సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాల్లో సీరత్ కపూర్ నటించింది. సీరత్ కపూర్ కి కోరుకున్న ఇమేజ్, గుర్తింపు రాలేదు. ఈ మధ్య ఆమె వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ సీజన్ 2 లో సీరత్ కపూర్ ఓ రోల్ చేసింది. మహి రాఘవ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. సేవ్ ది టైగర్స్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే సీరత్ కపూర్ భామాకలాపం 2లో నటించారు.