Homeఆంధ్రప్రదేశ్‌Ravi Prakash: రవి ప్రకాష్ దెబ్బకి వైసీపీ కదిలింది

Ravi Prakash: రవి ప్రకాష్ దెబ్బకి వైసీపీ కదిలింది

Ravi Prakash: ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొడతామని వైసిపి బలమైన ఆకాంక్షతో ఉంది. వై నాట్ 175 అని గట్టిగానే గర్జించింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ ఆ నమ్మకం సడలింది. సీట్లు తగ్గుతాయి కానీ.. గెలుపు మాదే అంటూ చెప్పుకొస్తోంది. అయితే సర్వేలు సైతం ప్రతికూల ఫలితాలు ఇస్తుండడంతో ఆందోళనలో పడింది. తాజాగా టీవీ9 రవి ప్రకాష్ తన ఆర్ టివి లో స్టడీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల ఫలితాలను ప్రకటిస్తున్నారు. గత రెండు రోజులుగా రాయలసీమ, కోస్తా ఫలితాలను వెల్లడించారు. రాయలసీమలో వైసీపీ స్వల్ప ఆధిక్యతలో ఉందని.. కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్రలో వైసీపీకి దెబ్బ తప్పదు అన్న ఆర్కే సంకేతాలతో వైసిపి ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. టీవీ9 రవి ప్రకాష్ ను తప్పు పడుతూనే.. జాగ్రత్త పడుతోంది.

రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది.తాజా సర్వేల్లో సైతం ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని స్పష్టం అవుతుంది. తాజాగా టీవీ9 రవి ప్రకాష్ సర్వేలో సైతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తేలింది. ఈ పరిస్థితుల్లో వైసిపి ఫ్యాక్ట్ చెక్ పేరిట కొత్త ఎత్తుగడ వేసింది. అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి, రెవెన్యూ లోటు అధిగమించడం వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రచారం చేయడం ప్రారంభించింది. వాటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

1995లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి.. 2004 వరకు ఏటా రెవెన్యూ లోటు పెరుగుతూ రావడాన్ని ప్రస్తావించింది. 2014 నుంచి 2019 మధ్య రెవెన్యూ లోటుతో పాటు చేసిన అప్పుల గురించి కూడా విపులంగా వివరించే ప్రయత్నం చేస్తోంది.మొన్నటి వరకు సంక్షేమ పథకాలను తప్పు పట్టిన చంద్రబాబు.. తన మేనిఫెస్టోలో రెట్టింపు సంక్షేమం ఎలా ఇస్తారని ప్రశ్నించడం ప్రారంభించింది. కొద్దిపాటి అప్పులు చేస్తేనే శ్రీలంక మాదిరిగా ఏపీ తయారైందని చెప్పిన చంద్రబాబు.. ఈ పథకాలకు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారని ప్రశ్నిస్తోంది. సంపద సృష్టించిపథకాలను అమలు చేస్తామన్న చంద్రబాబు.. రెవెన్యూ లోటును ఎందుకు తగ్గించలేకపోయారని నిలదీస్తోంది.

రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు, వేల సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు, లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, నాడు నేడు పథకంతో పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడి భవనాల అభివృద్ధి వంటి వాటిని గుర్తుచేస్తూ వైసిపి ప్రచారం చేస్తోంది. అయితే ఇన్నాళ్లు అతి ధీమాతో ఉన్న వైసిపి.
. టీవీ9 రవి ప్రకాష్ స్టడీ సర్వే తో జాగ్రత్తపడడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular