HomeతెలంగాణDouble Decker Buses: ప్రభుత్వం మారింది.. డబుల్ డెక్కర్ బస్సు పోయింది

Double Decker Buses: ప్రభుత్వం మారింది.. డబుల్ డెక్కర్ బస్సు పోయింది

Double Decker Buses: ఒకప్పుడు హైదరాబాద్‌ రోడ్లపై గంభీరంగా తిరిగిన ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. నాడు తీవ్ర నష్టాలు రావడంతోనే వాటిని సంస్థ క్రమంగా వదిలించుకుంది. ఈమేరకు అశోక్‌ లేలాండ్‌ అనుబంధ స్విచ్‌ మొబిలిటీతో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దుచేసుకుంది.

కేటీఆర్‌ ఒత్తిడితో..
నగరంలో 2004 వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండడంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్‌ డెక్కర్‌ ఫొటోను షేర్‌చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిపితే బాగుంటుందని సోషల్‌ మీడియా ద్వారా నాటి మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణాశాఖకు సూచించారు. దీనికి రవాణాశాఖ కూడా ఓకే చెప్పింది. ప్రయోగాత్మకంగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు నేడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

ఆటంకాలు లేని మార్గంలో...
ఫ్లై ఓవర్లు, ఫుట్‌ ఓవర్‌ వంతెనలు లేని మార్గాలను ఎంపిక చేసింది. ఈమేరకు సుచిత్ర మీదుగా సికింద్రాబాద్, మేడ్చల్‌ మధ్య, బాలానగర్‌ మీదుగా సికింద్రాబాద్‌ – పటాన్‌ చెరు, అమీర్‌పేట మీదుగా క కోటి–పటాన్‌చేరు, సీబీఎస్‌–జీడీఎమట్ల, దుర్గం చెరువు కేబుల్‌ వంతెనల మీదుగా డబుల్‌ డెక్కర్‌ నడపాలని నిర్ణయించింది. దీంతో దేశంలోని పలు నగరాలకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు సరఫరా చేస్తున్న స్విచ్‌ మొబిలిటీ సంస్థ బస్సుల సరఫరా టెండర్లు దక్కించుకుంది. అయితే ధర ఇంకా ఖరారు కాలేదు.

ప్రభుత్వం మారడంతో..
అంతా ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ప్లై ఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్‌ డెక్కర్‌ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు వస్తాయని తెలిసినా నాటి మంత్రి కేటీఆర్‌ ఒత్తిడితో ఆర్టీసీ అంగీకరించింది. ప్రభుత్వం మారడంతో ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఓల్వోలాంటి విదేశీ బ్రాండ్‌ సర్వీసుల నిర్వహణనే భారంగా భావిస్తున్న తరుణంలో డబుల్‌ డెక్కర్‌ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper