Prabhas: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. వాళ్ల పెదనాన్న అయిన కృష్ణంరాజు ఎలాంటి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడో ప్రభాస్ అంతకు మించి సరికొత్త హీరోగా అవతరించడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో పాన్ ఇండియా లో మొదటి సక్సెస్ ని అందుకున్న హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇక ఇప్పటికే కల్కి, రాజసాబ్ అనే రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు స్పిరిట్ అనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే జూలై నుంచి సరికొత్త లవ్ స్టోరీ లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అందులో భాగంగానే హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ఫైనలైజ్ అవ్వడంతో జులై నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో టాలీవుడ్ లో ఉన్న అగ్రనిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుంది. ఇక ‘సీతారామం’ తో హను రాఘవపూడి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో కలిసి ప్రభాస్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ లెవెల్లో ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.
ఇక ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఇప్పుడు హను రాఘవపూడి లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకులకు అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే హను రాఘవపూడి అప్పుడు సీతారామం సినిమాని చాలా బాగా తీసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ప్రభాస్ తో సరికొత్త లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనేది చాలా చర్చనీయాంశంగా మారింది…ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ మారుతి తో చేస్తున్న రాజసాబ్ సినిమా పరిస్థితి ఏంటి?అంటూ చాలా మంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ అప్పటి వరకు అయిపోతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…