T20 World Cup 2024: జూన్ రెండు నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించి అన్ని దేశాలు తమ స్క్వాడ్స్ ను ప్రకటించాయి. ఇక శుక్రవారం అమెరికా తన 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అది పేరుకే అమెరికా జట్టు.. అందులో ఉన్నది మొత్తం భారతీయ మూలాలు కలిగి ఉన్న ఆటగాళ్లే. అమెరికా జట్టుకు కెప్టెన్ గా గుజరాత్ రాష్ట్రంలో జన్మించి.. శ్వేత దేశంలో స్థిరపడిన మోనాంక్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. గతంలో అతడు గుజరాత్ అండర్ – 19 జట్టుకు బ్యాటర్, వికెట్ కీపర్ గా వ్యవరించాడు. ఇతడు మాత్రమే కాదు 2018-19 రంజీ సీజన్ లో అద్భుతంగా ఆడి, హైయెస్ట్ రన్స్ చేసిన మిలింద్ కుమార్ కూడా అమెరికా టీ – 20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. మిలింద్ 2018 – 19 సీజన్ లో రంజీ ట్రోఫీలో సిక్కిం తరఫున మిలింద్ 1,331 రన్స్ సాధించాడు. 33 సంవత్సరాల మిలింద్.. ఢిల్లీలో పుట్టాడు. ఢిల్లీ, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల తరఫున దేశవాళీ క్రికెట్ లో ఆడాడు. ఐపీఎల్ లో ఢిల్లీ, బెంగళూరు జట్లలో మెరిశాడు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
ఇక ముంబై జట్టుకు చెందిన మాజీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ హర్మీత్ సింగ్ కూడా అమెరికా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 31 సంవత్సరాల వయసు ఉన్న హర్మీత్.. ముంబైలో పుట్టాడు. 2012లో నిర్వహించిన అండర్ 19 ప్రపంచ కప్ లో భారత అంజెట్టు తరఫున ఆడాడు.. ఇక వీరితోపాటు సౌరభ్ నేత్ర వల్కర్ కూడా అమెరికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2010లో అండర్ -19 ప్రపంచకప్ లో భారత జట్టుకు ఆడాడు. కేఎల్ రాహుల్, జయదేవ్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లతో ఇతడు ఆడాడు. అమెరికా జట్టులో సౌరభ్ ప్రస్తుతం కీ ప్లేయర్ గా ఉన్నాడు. 2020లో కోల్ కతా జట్టుకు ఆడిన పేస్ బౌలర్ అలీ ఖాన్ కూడా అమెరికా జట్టుకు ఆటగాడిగా ఎంపికయ్యాడు. 2012 అండర్ -19 ప్రపంచ కప్ ను భారత జట్టుకు అందించిన ఉన్ముక్త్ చంద్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సిరీస్ లో స్మిత్ పటేల్ కీపర్ గా వ్యవహరించాడు. అయితే వీరిద్దరూ అమెరికా జట్టులో స్థానం సంపాదించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా చోటు లభించలేదు.
అమెరికా జట్టు ఇదే
మొనాంక్ పటేల్ (కెప్టెన్), షహన్ జహంగీర్, స్లీవెన్ టేలర్, జోన్స్, శాడ్లీ, గౌస్, సౌరభ్, నిసర్గ్, అండర్సన్, కెంజిగె, అలీ ఖాన్, హర్మిత్ సింగ్, జెస్సి సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్.
టి20 వరల్డ్ కప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. అమెరికాలో ప్రత్యేకంగా మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణం పూర్తయిందని ఐసీసీ ప్రకటించింది. వేరేచోట మైదానాలు తయారుచేసి.. స్టేడియంలో నిర్మించిన చోట వాటిని ఏర్పాటు చేస్తున్నారు. సమయం లేకపోవడం, వాతావరణంలో తేడా, కార్మికుల లేమి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ ప్రకటించింది. అప్పట్లో స్టేడియాల నిర్మాణంలో జాప్యం చోటు చేసుకోవడంతో.. ఐసీసీ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత మైదానం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.
It’s almost time to defend our home turf in the @T20WorldCup! Here is our 15-player squad that will be representing the United States in the World Cup beginning on June 1!#WeAreUSACricket #T20WorldCup #TeamUSA #Cricket pic.twitter.com/phnzT2Ce48
— USA Cricket (@usacricket) May 3, 2024