Bipin Rawath Helicopter Crash: భారత త్రివిధ దళాధిపతి అయిన బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన ఘోర హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశాన్ని విషాదంలో నింపింది. బిపిన్ రావత్ తోపాటు ఆయన భార్య, 13మంది ఈ ప్రమాదంలో మరనించారు. ప్రమాదం చివరి క్షణాల్లో ఆ అడవిలో సంచరిస్తున్న కొందరు పర్యాటకులు ఈ హెలిక్యాప్టర్ ను వీడియో తీశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.
ప్రమాదం జరిగినప్పుడు హెలిక్యాప్టర్ దట్టమైన పొగమంచులో వెళ్లిపోతున్నట్టు కనిపించింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అడవిలో సంచరిస్తున్న కొందరు పర్యాటకులు ఈ వీడియో తీశారు. మొత్తం మంచుతో నిండిన ఆ ప్రాంతంలో హెలిక్యాప్టర్ మసకగా కనిపించింది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు.
హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి ముప్పై అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. అనంతరం దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అందులోని సమాచారంతో హెలికాప్టర్ కూలిపోయే సమయంలో బిపిన్ రావత్ ఏం మాట్లాడారు? పైలట్ తో ఏం చర్చించారు? అనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. దీంతో ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ తో పాటు మూడు ఇతర వస్తువులు కూడా దొరికాయి.
Also Read: బిపిన్ రావత్ మరణం అనుమానాస్పదం.. బాంబు పేల్చిన సుబ్రహ్మణస్వామి
మరోవైపు సంఘటన స్థలాన్ని ఉన్నతాధికారుల పరిశీలించారు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి పరిశీలించారు. డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి సంఘటన స్థలంలో ఫోరెనిక్స్ నిపుణులతో ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలని సూచించారు.
బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ వీడియో
Also Read: కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రయాణాలు ప్రాణాంతకం..