Bipin Rawath: బీజేపీ కురువృద్ధుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ పార్టీ ఎంపీ అని చెప్పడం కానీ ప్రతీసారి అన్యాయాలు, అక్రమాలు, వాస్తవ సంఘటనలపై సొంత పార్టీనే టార్గెట్ చేసి విమర్శిస్తుంటారు.మోడీ, అమిత్ షాలను అస్సలు పట్టించుకోరు. వారు ఈ పెద్దాయన స్వామికి పార్టీ నుంచి ఎప్పుడో తిలోదకాలిచ్చారు.

Bipin Rawath
ఇప్పటికే ఏపీలోని టీటీడీ ఆభరణాల స్కాం సహా దేశంలో బీజేపీ తెచ్చిన సాగు చట్టాలు, రాఫెల్ స్కాం ఎన్నింటిపైనో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీని ఇరుకునపెట్టేలా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా భారత త్రివిధ దళాల అధిపతి అయిన బిపిన్ రావత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులోని ఊటీ సమీప అడవుల్లో ఓ కార్యక్రమానికి వెళుతుండగా బిపిన్ రావత్ తోపాటు ఆయన భార్య, 13 మంది ఆర్మీ అధికారులు హెలిక్యాప్టర్ కూలీ మరణించాంచడం విషాదం నింపింది. ఈ దుర్ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత
‘తమిళనాడు లాంటి సేఫ్ జోన్ లో మిలటరీ హెలిక్యాప్టర్ పేలిన విషయం సాధారణ అంశం కాదని.. ఈ వ్యవహారంలో తీవ్రమైన దర్యాప్తు అవసరం’ అని సుబ్రహ్మణ్య స్వామి బాంబు పేల్చారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈ ఘటనపై విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బిపిన్ రావత్ మరణంపై దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో ఈ మరణం గురించిన వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!